తెలంగాణ

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, నవంబర్ 23: రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని పడిగాపూర్, ఊరట్టం సమీపంలోని జంపన్నవాగుపై ఆయన బుధవారం నాలుగు చెక్‌డ్యాంలు, కాటాపూర్‌లో రైతుల సౌకర్యార్థం 1.20 కోట్ల రూపాయలతో నిర్మించే 33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్, 30 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌ను కూడా ప్రభుత్వం అందిస్తోందని, రాష్ట్రంలో ప్రజావసరాలను పూర్తి అవగాహన చేసుకుని పెద్దఎత్తున పథకాల అమలుకు రూపకల్పన చేయడంలో దేశంలోనే ప్రథమస్థానంలో సిఎం కెసిఆర్ నిలిచారని అన్నారు. కొన్ని ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక అభాండాలు వేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్నసాగర్‌కు భూములివ్వం
ఆందోళన కొనసాగిస్తామన్న
వేములగట్టు జెఎసి నేతలు
తొగుట, నవంబర్ 23: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములిచ్చేది లేదని, భూనిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రభు త్వం ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని సిద్దిపేట జిల్లా వేములగట్టు గ్రామస్థులు బుధవారం తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ జెఎసి నేతలు మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటే పాతరేయాలని మాట్లాడడం విచారకరమన్నారు. బాధితుల గోడు పట్టించుకోకుండా హెచ్చరికల ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి గ్రామస్థు లు భూములిచ్చేది లేదని వెల్లడించారు. గ్రామ జెఎసి నేతలు మల్లారెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హయతుద్దీన్, నర్సారెడ్డి, శ్రీశైలం మాట్లాడారు. సెక్షన్ 45పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక మంత్రి ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదన్నారు. ప్రజాకాంక్ష నెరవేరేదాకా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
ప్రాణం తీసిన
నోట్ల మార్పిడి
కరెన్సీ మార్పిడి కాకపోవడంతో
గుండెపోటుతో ఒకరి మృతి
జగిత్యాల, నవంబర్ 23: పాత నోట్ల మార్పిడి తంతు ఒకరి ప్రాణం తీసింది. అప్పు చెల్లించేందుకు నోట్ల మార్పిడి కాకపోవడంతో కలత చెంది గుండెపోటుకు గురై మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రమైన జగిత్యాలలో చోటు చేసుకుంది. ఖిలాగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ అమ్జద్ (48) ఇక్కడి వ్యవసాయ మార్కెట్‌లో తాత్కాలిక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తాను మరో వ్యక్తి వద్ద తీసుకున్న అప్పును చెల్లించేందుకు తన వద్ద రూ. 500 నోట్లు పది ఉన్నాయ. సదరు అప్పుదారు పాత నోట్లు తీసుకునేందుకు నిరాకరించడంతో బ్యాంకు వద్ద మార్పిడి కోసం మంగళవారం ప్రయత్నించాడు. తన అకౌంట్ ఉన్న బ్యాంకు వద క్యూలో నిలబడ్డాడు. చాంతాడంత క్యూలో నిలబడ్డ అమ్జద్ కౌంటర్ వద్దకు చేరుకునేసరికి సమయం మించిపోవడంతో నోట్ల మార్పిడి జరగక ఇంటికి వచ్చేశాడు. అప్పు తీర్చేందుకు మార్పిడి అడ్డంకిగా మారడంతో రాత్రి తీవ్రంగా కలత చెందిన అమ్జద్‌కు అదే రోజు రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ పెద్ద మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.