తెలంగాణ

మోదీతో భేటీ తర్వాత కెసిఆర్ వౌనమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత నోట్ల రద్దుపై ఎందుకు మాట్లాడడం లేదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో పార్టీ ఆఫీసు బేరర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యులతో సమావేశమై చర్చించారు. సమావేశానంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసి 15 రోజులైనా పేద ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. ప్రధాని అనాలోచిత, లోపభూయిష్టమైన నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని విమర్శించారు. రైతులు, పేదలు అన్ని పనులు వదులుకుని గంటల తరబడి బ్యాంకుల వద్ద నిలబడాల్సి వస్తున్నదని అన్నారు. నల్లధనం నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారని, ఇప్పటి వరకు ఎంతమందిని పట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలలో నిలుచున్నవారికి మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. నోట్ల రద్దు కాగానే ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. తన డబ్బును ఎలా మార్చుకోవాలో అర్థం కాక గవర్నర్ వద్దకు, ప్రధాని వద్దకు వెళ్ళారని ఆయన తెలిపారు. ప్రధానితో ఏమి మాట్లాడారో ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచి పెట్టారని ఆయన ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుపై తాము ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 28న ఆక్రోస్ దివస్‌గా నిర్వహించాలని ఎఐసిసి పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే వాస్తు పేరిట ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయానికి 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆయన విమర్శించారు.