తెలంగాణ

పడిగాపులు పడుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుతో తెరపైకి వచ్చిన కరెన్సీ కష్టాల గురించి వాస్తవాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు బుధవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన జరిపాయి. ఈ బృందంలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి అనామికాసింగ్ బుధవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. బ్యాంకులు, ఎటిఎంల వద్దకు వెళ్లి వినియోగదారులు, ప్రజలు నగదు డ్రా చేసుకునేందుకు, డిపాజిట్లు, కరెన్సీ మార్పిడికి ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించారు. ఈ సందర్భంగా వారికి ఎదురవుతున్న ఇక్కట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని పర్యాయాలు బ్యాంకులు, ఎటిఎంల వద్దకు వచ్చారు, ఎంత పరిమాణంలో నగదును డ్రా చేసుకున్నారు, ఎన్ని నోట్లు మార్పిడి చేసుకున్నారు, పాత నోట్లు ఎంత డిపాజిట్ చేశారు, ఎటిఎంల ద్వారా సేవలు ఎలా అందుతున్నాయి తదితర వాటి గురించి ఆరా తీశారు. ప్రధానంగా ఎటిఎం సేవలు సరిగా లేవని వినియోగదారులు ఒకింత అసంతృప్తి వెళ్లగక్కారు. నిన్నమొన్నటి వరకు ఎటిఎంలు అసలే పనిచేయలేదని, ఇప్పుడు కూడా నగదు నిల్వలు ఉంచిన కొద్దిసేపటికే అవి అయిపోతుండడంతో గంటల వ్యవధిలోనే ఎటిఎంలు పని చేయడం లేదని వాపోయారు. దీంతో గత్యంతరం లేక బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో పడిగాపులు పడాల్సి వస్తోందని తెలిపారు.
పెద్ద నోట్లను రద్దు చేయడం బాగానే ఉన్నప్పటికీ, కరెన్సీ కష్టాలు చుట్టుముట్టకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోటుతో చిల్లర సమస్య ఉత్పన్నమవుతోందని మరికొందరు కేంద్ర బృందం సభ్యురాలి దృష్టికి తెచ్చారు. అవసరమైన మేర కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని వ్యాపార, వాణిజ్య వర్గాలవారు వాపోయారు. అనంతరం కేంద్ర బృందం సభ్యురాలు అనామిక తెలంగాణలో రెండవ అతి పెద్దదైన ఇందూరు మార్కెట్ యార్డును కూడా సందర్శించి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల సందర్భంగా రైతులు, వ్యాపార వర్గాలవారు అవలంబిస్తున్న విధానాలు, నగదు చెల్లింపులు, ఉత్పత్తుల సేకరణ తదితర అంశాలను నిశితంగా పరిశీలన జరిపి స్థానిక అధికారుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రగతిభవన్‌లో కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా, జె.సి రవీందర్‌రెడ్డి, ఓఎస్‌డి రాహుల్‌హెడ్గే ఇతర అధికారులతో కలిసి బ్యాంకర్లు, వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో కేంద్ర బృందం సభ్యురాలు సమావేశమ య్యారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన అనంతరం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ యోగితారాణా ఆమెకు వివరించారు.

ప్రగతిభవన్‌లో అధికారులు, బ్యాంకర్లు, వ్యాపార వర్గాల వారితో సమావేశమైన కేంద్ర బృందం సభ్యురాలు అనామికసింగ్

నోట్ల రద్దును
స్వాగతిస్తున్నారు

కేంద్ర బృందం సభ్యురాలు అనామిక

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని చోట్లా ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. అయితే ప్రజల అవసరాలకు సరిపడా కరెన్సీని అందుబాటు లో ఉంచాల్సిందిగా కోరుతున్నారని తెలిపారు. 1000, 500 రూపాయల పాత నోట్లను రద్దు చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్న విషయం వాస్తవమేనని, అయితే ఈ సమస్యలన్నీ త్వరలోనే సమసిపోతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో తాము గమనించిన అంశాల ను, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను క్రోడీకరి స్తూ నివేదిక ను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.