తెలంగాణ

మనసంతా ఇటువైపే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, నవంబర్ 23: రాష్ట్రం విడిపోయి ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ఒక విధంగా ఉంటే ముంపుమండలాల ప్రజల పరిస్థితి మరో విధంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తాము ఏ ప్రాంతంలో ఉన్నామో గర్వంగా చెప్పగలుగుతుంటే ఏడు ముంపు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల పరిస్థితి విభిన్నంగా ఉంది. వారు ఏపిలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వెళ్ళడం, గోదావరి ముంపు పేరుతో వారికి నష్టపరిహారం చెల్లించడం, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి వారు ఈ ప్రాంతంలో పంటలు వేయకూడదని చెప్పడం చకచక జరిగిపోతూనే ఉన్నాయి. అక్కడ నివసించేవారిలో సగం గిరిజనేతరులు కావడం, వారికి జంగారెడ్డిగూడెం సమీపంలో కాలనీ నిర్మించే ప్రతిపాదనలు జరుగుతున్న నేపథ్యంలో కాలనీ ఇంటికి సంబంధించి రూ.3.5లక్షలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు సత్తుపల్లి, ఖమ్మం, హైద్రాబాదు నగరాలకు వెళ్లాలని భావిస్తున్నారు. వీరిని తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అనేకమంది తాము దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకే వెళ్తామని తెగేసి చెప్పడం విశేషం. సుమారు 9వేల కుటుంబాలు ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గిరిజనేతరుల కుటుంబాలలోని పిల్లలు అధిక శాతం మంది తెలంగాణలోనే విద్యాబుద్దులు నేర్చుకుని ఇక్కడే స్థిరపడ్డారు. 2017 అక్టోబరులోగా దశలవారీగా ముంపు గ్రామాలన్నింటిని ఖాళీచేయాలని, నిర్ణీత గడువు తర్వాత విద్యుత్‌తో సహా అన్ని సౌకర్యాలు నిలిపివేస్తామని అధికారులు ముంపు మండలాలలో ప్రకటించారు. ఈలోగానే కొత్త నివాసాలను ఉపాధి మార్గాలను అనే్వషించే పనిలో ముంపుగ్రామాల ప్రజలు అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చేరుకుంటున్నారు.