తెలంగాణ

కడగండ్లు తీరుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వౌన ప్రేక్షక పాత్ర పోషించడం సరైంది కాదని, ఇబ్బందుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సోమవారం మధ్యాహ్నం 2.30కు జరుగనున్న కేబినెట్ భేటీలో చర్చంచాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో (ప్రగతి భవన్) ఆదివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. లక్షలాది ప్రజల ఇబ్బందులను తొలగించడానికి ఏం చర్యలు తీసుకోవాలో అధికారులు, మంత్రులు ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. అలాగే నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించడంతో పాటు ఈ-పేమెంట్స్ వ్యవస్థ అమలు విధానాన్ని రూపొందించడానికి ఐదుగురు సీనియర్ ఐఏఎస్‌లతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీలో ఐఏఎస్ అధికారులు సురేశ్ చంద్ర, శాంతికుమారి, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, సూర్యాపేట కలెక్టర్ సురేంద్ర మోహన్‌ను నియమించామన్నారు. భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు చర్చించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో వారికి ప్రభుత్వం సహాయకారిగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోవాలో కార్యాచరణ రూపొందించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. సోమవారం జరుగనున్న మంత్రిమండలిలో పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిస్థితులపై కూలంకషంగా చర్చించనున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నోట్ల రద్దువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చూపనున్న ప్రభావంపై సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఇలాఉండగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టుల పనులు తదితర అంశాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు టి హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సిఎంఓ అదనపుకార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

chitram...
ప్రగతిభవన్‌లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయ అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న సిఎం కె చంద్రశేఖర్ రావు