తెలంగాణ

తెలంగాణ గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా దాదాపు అన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి ఏడు డిగ్రీల వరకూ చేరడంతో గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు శాపంగా మారింది. ఆదిలాబాద్ , కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో విద్యార్ధులు తగ్గిన ఉష్ణోగ్రతలతో ఒణికిపోతున్నారు. చలి తీవ్రత కూడా బాగా పెరిగి కనీస స్థాయికి మించి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. గురుకులాలు, మోడల్ స్కూళ్లలో హాస్టల్ విద్యార్ధులు, కస్తూరిబా విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్ధినులకు దుప్పట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ దుప్పట్ల పంపిణీ డిసెంబర్ 15వ తేదీలోపు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల గురుకులాలల్లో చదువుకుంటున్న దాదాపు లక్ష మందికి పైగా విద్యార్ధులకు లబ్ది చేకూరుతుంది. ఈ దుప్పట్ల పంపిణీకి రెండున్నర కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 74,282 మంది, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలో 15562 మంది, గురుకులాల్లో 17,561 మంది విద్యార్ధులున్నారు. మొత్తం 1,04,405 మంది విద్యార్ధులు రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.