తెలంగాణ

రూ. 30లక్షల పాత నోట్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం భారీగా పెద్ద నోట్లు దాచుకున్న వారి పాలిట శాపంగా మారింది. తాజాగా జనగాంలో భారీగా నగదు పట్టుబడింది. వాహన తనిఖీల్లో రూ.30లక్షల విలువైన రద్దయిన పెద్ద నోట్లు పట్టుబడినట్లు జనగామ డిసిపి తేజావత్ వెంకన్న సోమవారం సాయంత్రం వెల్లడించారు. స్థానిక ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డబ్బులను తరలిస్తున్న నిందితుడితో పాటు నగదును చూపించారు. ఈ సందర్భంగా డిసిపి వెంకన్న మాట్లాడుతూ పక్కా సమాచారం ప్రకారమే నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన కూల్‌డ్రింక్స్ వ్యాపారి నీలం కనకయ్య తన వద్ద ఉన్న రూ.30లక్షల(రద్దు చేసిన 1000, 500) నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు హన్మకొండలో ఉన్న రవి అనే మరో వ్యాపారికి గత వారంరోజుల కిందట పంచించారు. రవికి అవి మార్చడం సాధ్యం కాక డబ్బులను తీసుకెళ్లమని కోరడంతో కనకయ్య తన కారులో వచ్చి డబ్బులను హైదరాబాద్‌కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు స్థానిక సిఐ ముస్కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో యశ్వంతాపురం సమీపంలోని జాతీయ రహదారి జెర్సీ పాలకేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కనకయ్యకు సంబంధించిన కారును తనిఖీ చేయగా అందులో చెలామణిలో లేని పెద్దనోట్లు బయటపడ్డాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని జనగామ ఎసిపి కార్యాలయానికి తరలించారు. అనంతరం అట్టి డబ్బులను ఆదాయ పన్నుల శాఖకు అప్పగించి నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న డిసిపి వెంకన్న తెలిపారు. ఈ సమావేశంలో ఎసిపి పద్మనాభరెడ్డి, సిఐ ముస్కె శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

పట్టుబడిన నగదు, నిందితుడిని మీడియా
సమావేశంలో ప్రవేశపెట్టిన డిసిపి వెంకన్న