తెలంగాణ

తగ్గిన ఆదాయాన్ని కేంద్రమే పూడ్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దుతో తగ్గిన రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రమే పూడ్చాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రధాన మంత్రిని కలిసి అందజేసిన లేఖలోని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మీడియాకు విడుదల చేశారు. నోట్ల రద్దు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ్భాగానికి రూ.7500 కోట్ల నష్టం వాటిల్లిందని సిఎం అందులో పేర్కొన్నారు. ఈ నష్టం ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని, కేంద్రం నష్టనివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నోట్ల రద్దు తర్వాత ఒక్క వారంలోనే వాట్, మోటర్ వెహికిల్ టాక్స్, రిజిస్ట్రేషన్స్ తదితర వాటిలో 50 శాతం రాబడి తగ్గిందని పేర్కొన్నారు.
రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన రుణాలకు అసలు, వడ్డీని తిరిగి చెల్లింపులను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని కోరారు. నోట్ల రద్దు వల్ల నిర్మాణరంగ కార్మికులు ఉపాధి కోల్పోయారని, రియల్ ఏస్టేట్ రంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉపాధి కల్పనకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల తరపునే రోడ్లు, భవనాల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. చాలా మటుకు రైతులకు బ్యాంకు ఖాతాలు లేవని, వారు నగదు ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తుంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం రైతులు భూములను విక్రయించుకున్నారని, వారి వద్ద ఉన్న డబ్బును బ్యాంకులలో జమ చేయడానికి అవకాశం కల్పించడంతో పాటు వారి నుంచి తక్కువ పన్ను వసూలు చేయాలని సూచించారు. ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిందని, ఈ పథకానికి వివిధ ఆర్థిక సంస్థలు రూ. 5 వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, కూరగాయాలు, పండ్ల విక్రయించే వారిని ఆదుకునేందుకు లక్ష రూపాయల వరకు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని, వివాహాల కోసం రూ. 4 లక్షలు విడుదల చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ దేశంలోనే పెద్దదని, నోట్ల రద్దు తర్వాత 70 శాతం వ్యాపారం తగ్గిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగం కింద ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించే గడువును కనీసం రెండేళ్లయినా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కోరారు.

సోమవారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి ఉన్నారు

ఉస్మానియా రిజిస్ట్రార్‌గా ప్రొ.గోపాల్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 28: ఉస్మానియా విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజిక్స్ డీన్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డిని నియమించారు. ఉత్తర్వులు అందిన వెంటనే గోపాల్‌రెడ్డి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
పియర్సన్ విజేత జాన్సన్ గ్రామర్ స్కూల్
హైదరాబాద్ నవంబర్ 28:పియర్సన్ సంస్థ నిర్వహించిన వైడ్ క్విజ్ పోటీలో జాన్సన్ గ్రామర్ స్కూల్ విద్యార్ధులు గ్రీష్మా, సంప్రీత్‌లు విజేతలుగా నిలిచారు. ఎపిస్టోమో గ్లోబల్ స్కూల్ విద్యార్ధులు తేజస్వి పి, సాకేత్ ఎ ద్వితీయ స్థానంలో నిలిచారని పియర్సన్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ దొరైస్వామి చెప్పారు.
గడువు పొడిగింపు
హైదరాబాద్, నవంబర్ 28: డిపార్టుమెంటల్ పరీక్షల దరఖాస్తు గడువును నవంబర్ 27 నుండి 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం నాడు ప్రకటించింది. తెలంగాణ ఎన్‌జిఓలు చేసిన వినతి మేరకు ఈ గడువుపొడిగించినట్టు కార్యదర్శి పార్వతి చెప్పారు.

నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
సూర్యాపేట, నవంబర్ 28: జిల్లా పరిధిలోని గరిడేపల్లి మండలంలో ఈనెల 22న నోట్ల మార్పిడికి పాల్పడిన 12 మంది ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ పరిమళ హనానూతన్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి సమీపంలో నోట్ల మార్పిడి ముఠాకు సంబంధించిన వ్యక్తులు కమీషన్ పద్దతిపై రూ.4 లక్షల రద్దఅయిన నోట్లను తీసుకొని కొత్తవి రూ.3.60 వేలు నోట్ల మార్పిడి చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు గరిడేపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ముఠాకు చెందిన కొందరిని అరెస్ట్ చేసి విచారించగా ముఠాకు చెందిన 12 మంది వివరాలు తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించడంతో సోమవారం కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠాలో ప్రధాన ముద్దాయి గడ్డిపల్లి శాఖ ఎస్‌బిహెచ్ బ్యాంకు జీపు డ్రైవర్ గాదెగాని శ్రీను, అదే బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగి చెన్నం రామయ్య, గరిడేపల్లి మండలం గడ్డిపెల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసి సుందరి నాగేశ్వర్‌రావు, గడ్డిపెల్లి గ్రామానికి చెందిన ఆరెపురి నారాయణ, దేగుంట్ల నాగరాజు, నేలకంఠ రాంబాబు, సంద్యాల సతీష్, బట్టపల్లి వెంకటరమణ, కుత్బుషాపురం గ్రామ సర్పంచ్ బాణోతు శ్రీను, పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, కేసరి శోభ, నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన శానం వీరభద్రయ్యలను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన నింధితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. ఈ ఘటనలో గడ్డిపెల్లిలో కిరాణ షాపు నిర్వహిస్తున్న శోభ షాపు వద్ద మినీ ఎటిఎం ఉండగా మిగిలిన వారంతా గ్రామాల నుండి రైతులు, కూలీల పాస్‌పుస్తకాలు తీసుకొచ్చి బ్యాంకులో నగదు జమ చేయించి వారి ఏటిఎం కార్డులు తీసుకొని స్వైప్ చేసి కొత్త నోట్లను తీసుకొని కమీషన్ పద్ధతిపై నోట్ల మార్పిడి చేస్తున్నారన్నారు. వారి వద్ద నోట్ల మార్పిడికి సిద్ధంగా రూ.3.96 లక్షల నగదు, మినీ ఎటిఎంను స్వాధీనం చేసుకొని కోర్టుకు స్వాధీనపర్చినట్లు ఆమె తెలిపారు.

ఆసుపత్రుల్లోనే జనన, మరణ సర్ట్ఫికెట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇచ్చే అధికారం సర్కారు దవాఖానాల్లోని అధికారులకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు జనన, మరణ ధృవీకరణ సర్ట్ఫికెట్లు ఇచ్చే అధికారం స్థానిక సంస్థలకు ఉండింది. ఆసుపత్రుల్లో కాన్పు జరిగి పిల్లలు పుడితే, ఆ వివరాలు సమీపంలోని స్థానిక సంస్థల కార్యాలయాలకు తెలియచేయాల్సి వచ్చేది. హైదరాబాద్‌లో అయితే గ్రేటర్ మున్సిపాలిటీ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి), ఇతర ప్రాంతాల్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీలకు వివరాలను పంపించాల్సి వచ్చేది. ఈ తతంగం అంతా అయ్యేసరికి సర్ట్ఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతూ వస్తోంది.అందుకే నేరుగా ఈ తరహా సర్ట్ఫికెట్లు ఇచ్చే అధికారం ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలో తక్షణమే సర్ట్ఫికెట్లు జారీ చేసేందుకు వీలవుతుంది. బోధనాసుపత్రులు, జిల్లాస్థాయి ఆసుప్రతులు ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే చీఫ్ సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంఓలు, సివిల్ సర్జన్లు, డిప్యూటీ సివిల్ సర్జన్లు, మెడికల్ ఆఫీసర్లకు ఈ అధికారాన్ని కల్పించారు.