తెలంగాణ

పోలీస్‌ల అదుపులో నగల వ్యాపారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: బంగారు అభరణాలు, వజ్రాలు హోల్ సేల్‌గా సరఫరా చేసే వ్యాపారుల నుంచి దీపావళి ధమాకా, బంపర్ ఆఫర్ల పేరుతో సుమారు 50 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బులివ్వకుండా బ్యాంకాక్ పారిపోయిన నగల వ్యాపారి బిపిన్ జైన్‌ను చార్మినార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దసరా పండుగ తర్వాత అమ్మకాలు బాగా పెరుగుతాయంటూ బిపిన్ జైన్ హోల్‌సేల్ వ్యాపారులతో చర్చించి తరుచూ తీసుకునే బంగారు ఆభరణాల కన్నా ఎక్కువగా తీసుకున్నాడు. పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం 50 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను స్వాహా చేసేందుకు నిందితుడు ముందుగానే పథకం వేసుకున్నాడు. వీటిని కరిగించి బిస్కెట్లుగా మార్చుకుని గత నెల 24 రాత్రి కుటుంబ సభ్యులతో కలసి బ్యాంకాక్ వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న చార్మినార్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడు బిపిన్ జైన్ రెండ్రోజుల క్రితం తన సన్నిహితుడికి ఫోన్ చేసి తాను ముంబయికి వస్తున్నట్టు తెలిపాడు. దీంతో ఈ కేసుకు సంబంధించి చార్మినార్ పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాన్ని రంగంలోకి దింపారు. జైన్ వ్యాపారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల కదలికలపై నిఘాపెట్టి విశ్వసనీయ సమాచారం మేరకు వ్యాపారి జైన్‌ను చార్మినార్ పోలీసులు హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌజ్‌లో అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఒకటి, రెండ్రోజుల్లో పోలీసులు వెల్లడించనున్నట్టు తెలిసింది. నగల వ్యాపారి బిపిన్ జైన్‌పై నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లతో పాటు సిసిఎస్‌లో కూడా కేసులున్నట్లు తెలిసింది.