తెలంగాణ

జిడిపి పడిపోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల జిడిపి రెండు శాతం పడిపోతుందని టికాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 57 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు, నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా? అని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రాన్ని ప్రశ్నించారు. నగదు రహిత లావాదేవీలకు మన దేశ ప్రజలు ఇంకా సిద్ధంగా లేరనీ, ఇది లోగడ పలు సార్లు రుజువైందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఈ నగదు రహిత వ్యవస్థ ఎలా పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అక్షరాస్యత శాతం సరిగ్గా లేని మన దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదని అన్నారు. గృహిణులు ఎప్పుడు డిజిటలైజేషన్‌కు మారగలరో కేంద్రం ఆలోచించాలని కోరారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సిఎం కెసిఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.