తెలంగాణ

గంటలో మరుగుదొడ్డి నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, నవంబర్ 29: సంపూర్ణ పారిశుద్ధ్య సాధనకు స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రతి కుటుంబం తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుకుని జిల్లా యంత్రాంగాలు పెద్దఎత్తున కసరత్తులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల మినహా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఐఎస్‌ఎల్ నిర్మాణాల లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతోంది. వీటికి ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటును అందిస్తూ, లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసినప్పటికీ అనేక ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాత్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేవలం గంట వ్యవధిలోనే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాన్ని పూర్తి చేసి అందరిని ఔరా అనిపిస్తున్నాడు. అది కూడా తక్కువ వ్యయంతోనే పూర్తి చేస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. నిజామాబాద్‌కు ఆనుకుని చేరువలోనే ఉన్న నిర్మల్ జిల్లా బాసరకు చెందిన ప్రతీప్‌రావు కేవలం 12వేల రూపాయల వ్యయంతో గంట వ్యవధిలోనే వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఆయన స్వయంగా నవీపేట మండలం పోతంగల్ గ్రామంలో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో దీని నిర్మాణాన్ని చేపట్టగా, స్థానికులు చూసి అబ్బురపోయారు. ఎస్సీ బాలికల కోసం పోతంగల్ గ్రామంలో గురుకులాన్ని మంజూరు చేయగా, ప్రస్తుతం తాత్కాలికంగా ఆ గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భూంరావు ఇంట్లో దీనిని నెలకొల్పుతున్నారు. సుమారు వంద మంది బాలికలకు ఈ గురుకులంలో వసతితో కూడిన విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బాలికల సౌకర్యార్థం బాత్రూమ్‌లు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండడంతో ప్రతీప్‌రావు గురించి తెలుసుకుని అతనికి పని అప్పగించారు. ఈ సందర్భంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ క్షణాల్లో సిమెంట్, కాంక్రీట్‌ల మిశ్రమాన్ని కలిపి గంట వ్యవధిలోనే మరుగుదొడ్డి నిర్మాణాన్ని పూర్తి చేయడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకుని అనేక మంది పని కొనసాగే చోటుకు వచ్చి ఆఘమేఘాల మీద తయారవుతున్న మరుగుదొడ్లను చూసి ప్రతీప్‌రావును అభినందనల్లో ముంచెత్తారు. తాను మొట్టమొదట ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేసినట్టు ప్రతీప్‌రావు తెలిపారు. ప్రభుత్వం సహకారం అందిస్తే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరింత పెద్ద సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నివాస గృహాలను కూడా ఇదే విధానం ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పూర్తి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

కేవలం గంట వ్యవధిలోనే పూర్తి చేసిన మరుగుదొడ్డి నిర్మాణం (చిత్రంలో ప్రతీప్‌రావు)