తెలంగాణ

ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 1250 నుండి 1300 వరకూ గురుకులాలను ఏర్పాటు చేసి దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. ది హిందూ గ్రూప్ ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ -2016 కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మున్సిపల్ మంత్రి కె తారకరామారావు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది జూన్ నాటికి టాయిలెట్స్, ఆర్వో ప్లాంట్లు, రన్నింగ్ వాటర్, విద్యుత్, ప్రాక్టికల్ ల్యాబ్స్, భవనాలు వంటి అన్ని వౌలిక వసతులు పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని స్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ప్రస్తుతం 3352 స్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. డిగ్రీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ అందించేందుకు తెలంగాణ స్కిల్ సెంటర్లను ప్రతి కాలేజీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గత పాలకులు పలు చోట్ల జూనియర్, డిగ్రీ కాలేజీలకు అనుమతి ఇచ్చారని, కానీ ఎక్కడా వౌలిక వసతులు కల్పించలేదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం జూనియర్ డిగ్రీ కాలేజీలకు భూమి కేటాయించి సొంత భవనాలను నిర్మిస్తోందన్నారు. అదేవిధంగా బోధన సిబ్బందిపైనా సీరియస్‌గా దృష్టి సారించిందని అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధం చేస్తామని క్యాబినెట్ కూడా ఇందుకు ఓకె చెప్పిందని అన్నారు. క్రమబద్ధీకరణ తర్వాత ఉన్న ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ మంచి కార్యక్రమమని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని అన్నారు. దీనివల్ల పారిశ్రామిక వేత్తలు విద్యావేత్తలు ఒకే వేదికపైకి వస్తారని , ఫలితంగా విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలో చర్చ జరిగే వీలుంటుందని చెప్పారు.
కొన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాయని, అయితే ఈ సంస్థలు ఎక్కువగా విద్యపై దృష్టి పెట్టాలని కడియం పేర్కొన్నారు. వర్శిటీల్లో పరిశోధనలకు సైతం కార్పొరేట్ సంస్థలు ప్రోత్సాహాన్ని అందించాలని మనకు కావల్సిన వాటిని మనమే రూపొందించుకునే విధంగా పరిశోధనలు జరగాలని చెప్పారు.