తెలంగాణ

భారీగా ఐఏఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజి గోపాల్ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ మిశ్రా
గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా చిత్రా రామచంద్రన్ మున్సిపల్ పరిపాలనా కార్యదర్శిగా నవీన్ మిట్టల్

హైదరాబాద్, నవంబర్ 30: కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంతో పాటు భారీగా 20మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ పదవీ విరమణ చేయడానికి ముందు ఆయన పేరిట బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో పలువురు సీనియర్ ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడంతో ఈయన స్థానంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంజి గోపాల్‌ను నియమించింది. రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్న అజయ్ మిశ్రాను విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా చిత్రా రామచంద్రన్‌ను నియమించింది. సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆదార్ సిన్హాను నియమించింది. ఎక్సైజు, వాణిజ్యపన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సోమేష్‌కుమార్‌ను నియమించింది. రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సునిల్ శర్మను రవాణాశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా జి అశోక్‌కుమార్‌ను నియమించింది. మత్స్యశాఖ కమిషనర్‌గా బి వెంకటేశ్వర్‌రావును నియమించింది. యువజన సర్వీసులశాఖ కార్యదర్శిగా సభ్యసాచి ఘోష్‌ను నియమించింది. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా బెనహర్ మహశ్ దత్ ఎక్కాను నియమించింది. సమాచారశాఖ కమిషనర్‌గా ఉన్న నవీన్ మిట్టల్ కొనసాగిస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి పదవి నుంచి తప్పించి మున్సిపల్ పాలనా, అర్బన్ డవలప్‌మెంట్‌శాఖ కార్యదర్శిగా నియమించింది. రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నవీన్ మిట్టల్ స్థానంలో నియమించింది. జగిత్యాల సబ్ కలెక్టర్‌గా ఉన్న కె శంశాకను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా ఉన్న శృతి ఓజాను వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించింది. ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా ఉన్న అడ్విట్ కుమార్ సింగ్‌ను జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌గా నియమించింది. వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్, బోధన్ సబ్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, మెట్టుపల్లి సబ్ కలెక్టర్‌గా ముషరఫ్ అలీ ఫారుఖ్, నారాయణపేట సబ్ కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్యా, ములుగు సబ్ కలెక్టర్‌గా విపి గౌతమ్‌ను నియమించింది.

అజయ్ మిశ్రా ఎంజి గోపాల్ చిత్రా రామచంద్రన్