తెలంగాణ

ప్రమాణాలతో కూడిన ఫలితాలు ఠావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలల్లో సమస్త సౌకర్యాలను కల్పించడంతో పాటు, విద్యాత్మకంగా స్కూళ్లను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం నాడు నిర్వహించిన డిఇఓల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థుల నమోదుతో పాటు వారి ఫలితాలు, ప్రతిభాపాటవాలు కూడా చాలా ముఖ్యమని అంతా గుర్తించాలని అన్నారు.
ఉత్తమ ఫలితాలు పేరుతో కొన్ని పాఠ్యాంశాలను మాత్రమే బాగా చదివించే విధానం మంచిది కాదని, మొత్తం సిలబస్‌ను పూర్తి చేయాలని అన్నారు. ప్రతి స్కూలులో స్పెషల్ క్లాసులు, రివిజన్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పదే పదే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు ఎవరికీ తీసిపోని విధంగా ఉండాలని చెబుతున్నారని, ఆ మేరకు అంతా పనిచేయాలని అన్నారు.
స్కూళ్లలో వౌలిక వసతులపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించిందని, 2017 జూన్ నాటికి అన్ని స్కూళ్లలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా అపరిష్కృతంగా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లల నమోదును పెంచేందుకు బడి బాట నిర్వహించాలని, మధ్యలో మానేసిన విద్యార్థులను సైతం తిరిగి బడిలో చేర్చేందుకు కూడా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో నాలుగైదు డిజిటల్ తరగతులు ఉంటాయని, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలను పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. డిఇఓలు కచ్చితంగా జిల్లా కేంద్రాల్లో నివాసం ఉండాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తథ్యమని పేర్కొన్నారు. వ్యతిరేక వార్తలపై స్పందించాలని, విద్యార్థులను చీటికీ మాటికీ రోడ్ల మీదకు తీసుకురావద్దని అన్నారు. బాలికలను పాఠశాల బయటకు పంపించినపుడు వారి సంబంధీకుల నుండి లేఖలు తీసుకోవాలని, ఆడపిల్లల భద్రతకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతిపాఠశాలను స్వచ్ఛ హరిత పాఠశాలగా మార్చాలని సూచించారు. సదస్సులో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆచార్య, డైరెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.