తెలంగాణ

బ్యాంకు సిబ్బంది తోసేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 1: పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2000 నోటును అందుబాటులోకి తెచ్చి 20 రోజులు గడుస్తున్నా.. ప్రజలకు కరెన్సీ కష్టం తప్పడం లేదు. ‘కొత్త’ నోటుకు బ్యాంకుకు వెళితే సిబ్బంది తీరు వల్ల ఆసుపత్రి పాలయ్యారు. పైకానికి పోతే ప్రాణం మీదకు తెచ్చారు. సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్దకు డబ్బుల కోసం గురువారం వెళ్లిన ప్రజలు బారులు తీరారు. అధిక సంఖ్యలో ఖాతాదారులు రావడంతో బ్యాంకు నిండిపోయింది. గంటల తరబడి పడిగాపులు కాసినా మేనేజర్ బ్రహ్మయ్య డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఆయనతో జనం వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన మేనేజర్ బ్యాంకు నుంచి వారిని తోసేసి గేటుకు తాళం వేశారు. దాంతో మండల కేంద్రానికి చెందిన ముగ్గురు మహిళలు తూర్పు బాలమ్మ, ఆడెపు సుభద్ర, నస్రీన్ మెట్ల పైనుంచి కింద పడ్డారు. జనం అంతా ఒక్కసారిగా వారిపై కుప్పకూలారు. బాలమ్మ, సుభద్ర, నస్రీన్ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని స్థానిక ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. బాలమ్మ, సుభద్రల చేతులు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఉపేందర్ బ్యాంకు వద్దకు చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ తోసేయడంతోనే తీవ్ర గాయాలయ్యాయని బాధితులు ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబీకులు కోరారు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా డబ్బులు బ్యాంకులో లేవని చెప్పినా ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారని, వారిని అదుపు చేయడానికి ప్రయత్నించానని అయనా వినిపించుకోకపోవడంతో బయటకు నెట్టేసి గేటుకు తాళం వేశాన్నారు. వాళ్లే తోసేసుకోవడం వల్ల కింద పడి గాయాలపాలైతే తాను బాధ్యున్ని ఎలా అవుతానని ఆయన పేర్కొన్నారు.

చిత్రాలు..బ్యాంకు వద్ద గూమికూడిన ప్రజలు *చేయి విరిగిన బాధితురాలు బాలమ్మ