తెలంగాణ

నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. గతంలో విధించిన రుసుంపై అదనంగా 20 శాతం చెల్లించి తాజాగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు కూడా మున్సిపల్‌శాఖ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. రద్దు చేసిన పెద్దనోట్లతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు రుసుం చెల్లించడానికి గత నెల 24 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల పన్నులు, రుసుంలు చెల్లించడానికి రద్దు చేసిన నోట్లతో చెల్లించడానికి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగించగా, మరోసారి పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.