తెలంగాణ

ఆటోడ్రైవర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అల్వాల్, డిసెంబర్ 2: ఇద్దరు ఆటోడ్రైవర్ల వేధింపులు భరించలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగింది. అల్వాల్ సిఐ ఆనందరెడ్డి కథనం ప్రకారం ఓల్డ్ అల్వాల్ కుమ్మరిబస్తీ నివాసి, ఆటోడ్రైవర్ బాలరాజు ఆటోను రోజు వారీ కిరాయికి నర్సింహ వద్ద తీసుకుని నడిపిస్తున్నాడు. ఆయనకు, ఆటో యజమాని నర్సింహకు సుచిత్ర సర్కిల్ వద్ద ఆటోస్టాండ్ విషయంలో వారం రోజుల క్రితం వివాదం నెలకొని పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. బాలరాజు కూతురు గౌతమి వెంకటాపురంలోని కెఎంఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది . గౌతమి కళాశాలకు వెళ్లటానికి ఓల్డ్ అల్వాల్ బస్టాండులో నిలబడి ఉండగా ఆటో యజమాని నర్సింహ వద్ద ఆటోలు కిరాయికి తీసుకుని నడిపిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు విజయ్, ప్రకాష్ వారం రోజులుగా బస్టాండులో నిలబడి గౌతమిని వేధిస్తున్నారు. వారి వేధింపుల గురించి కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన గౌతమి శుక్రవారం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చూసి ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. నర్సింహ ప్రోద్బలంతోనే ఆటోడ్రైవర్లు విజయ్, ప్రకాష్‌లు తన కూతురిని వేధించారని, వారి వేధింపులకే ఆత్మహత్య చేసుకుందని బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ ఆనందరెడ్డి చెప్పారు