తెలంగాణ

కౌలుదారులనూ చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 2: జిఎస్‌టి బిల్లులోని వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులను చేర్చాలని కేంద్రానికి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్యక్షతన శుక్రవారం నాడు జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ ఐదవ సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిఎస్‌టి బిల్లులో ఏయే అంశాలు ఉండాలన్న దానిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. జిఎస్‌టి ముసాయిదా బిల్లులో కేవలం సొంత భూమిలో వ్యవసాయం చేసే వారిని మాత్రమే వ్యవసాయదారులుగా పేర్కొన్నారని వెల్లడించారు. దీనివల్ల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు నష్టపోతారని, అందువల్ల కౌలుదారులను కూడా వ్యవసాయదారుల జాబితాలో చేర్చాలని ఈ రోజు సమావేశంలో ప్రతిపాదించామని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ వ్యవసాయ రంగానికి వెనె్నముక అయినటువంటి డైరీ పరిశ్రమ,పౌల్ట్రీ పరిశ్రమ,హార్టీకల్చర్, సెరీకల్చర్‌లను కూడా వ్యవసాయ రంగ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించగా అందుకు మిగతా సభ్యులు కూడా మద్దతు తెలిపారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తాను ప్రత్యేకంగా సమావేశమయ్యానని, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించామని వెల్లడించారు. ఈ కోటాలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.450 కోట్లు రాష్ట్రానికి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.
7 మెగా ఫుడ్ పార్క్‌లకు ఆమోదం
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏడు మెగా ఫుడ్‌పార్కులకు 2008-15మధ్య ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి శుక్రవారం వెల్లడించారు. ఏపీలోశ్రీని ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెట్,చిత్తూరు, గోదావరి మెగా ఆక్వా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్,కృష్ణా జిల్లాల్లో ఆమోదించినట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలో స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నిజామాబాద్, రాగ మయూరి ఆగ్రోవెట్ ప్రైవేట్ లిమిటెడ్,మహబుబ్‌నగర్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఖమ్మం జిల్లాల్లో ఆమోదించినట్టు కేంద్రమంత్రి సమాధానంలో తెలియజేశారు.