తెలంగాణ

తొలి నగదు రహిత గ్రామానికి 10 లక్షల నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 2: నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా సిద్దిపేటను మార్చేందుకు ప్రజాప్రతినిధులు కంకణబద్ధులై ఉండాలని.. క్యాష్‌లెస్‌గ్రామంగా మొదట చేసిన గ్రామానికి 10లక్షల నజరానా ఇస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేటలో నగదు రహిత లావాదేవీలపై కౌన్సిలర్లు, సర్పంచులు, జడ్పీటిసి, ఎంపిటిసి సభ్యులు, గ్రామైఖ్య మహిళా సంఘాలు, అంగన్‌వాడీలు, హెచ్‌ఎంలకు జెసి హన్మంతరావు, డిఆర్‌డిఓ సత్యనారాయణరెడ్డి, కమిషనర్ రమణాచారితో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాష్‌లెస్ గ్రామానికి మొదటిదానికి రూ.10లక్షలు, రెండోదానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామని, సేవలన్నీ ఇంటిముందుకే వస్తాయన్నారు. ఇప్పటికే అన్నిట్లో ముందున్నామని, దీనిలో సైతం ప్రథమంగా ఉండాలన్నారు. మీరు స్వచ్ఛందంగా పూనుకుంటే ఏదైనా సాధ్యమని, మీరు వ్యక్తలుకారని, వందలాది మందిని సమూహంగా చేసే శక్తులన్నారు.