తెలంగాణ

ప్రజా వ్యతిరేక పాలనపై ఉద్యమిస్తాం: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వాటిపై ఉద్యమాలను ఇక ఉద్ధృతం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. యువకులకు ఉద్యోగాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించిందని, ఫీజు రియంబర్స్‌మెంట్ సకాలంలో చేయకపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. బిజెపి యువ మోర్చ నూతన అధ్యక్షుడిగా గుండగోని భరత్ గౌడ్ బిజెపి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత ఉద్యమాలను తీవ్రతరం చేయాలని సూచించారు. దేశాన్ని బలీయమైన ఆర్ధిక వ్యవస్థగా రూపొందించేందుకే ప్రధాని అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని దానిలో భాగంగా నగదు రహిత దేశంగా తయారుచేయడానికి రాష్ట్రంలో బిజెపి యువమోర్చ ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకురావాలని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో అవినీతి, నల్లధనం, లంచగొండితనం, తీవ్రవాదం, నకిలీనోట్ల ప్రభావంతో దేశాన్ని బలహీనపరిచాయని, ఈ జాడ్యాలను రూపుమాపి దేశాన్ని కాపాడటమే నరేంద్రమోదీ ధ్యేయమని అన్నారు. గుజరాత్‌లో అకోరా అనే గ్రామంలో ప్రజలు అంతా నగదు రహిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఇలాంటి అవగాహన పెంచాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనివీతి సొమ్ముతో రాజకీయాలను శాసించిందని, కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాలమయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి అంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి, శాసనమండలి నాయకుడు ఎన్ రాంచందర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, విక్రంరెడ్డి తదితరులు ప్రసంగించారు.