తెలంగాణ

మోసాలకు పాల్పడుతున్న బెంగళూరు ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ, దృష్టి మళ్లించడం, రాగి చెంబులో డబ్బు పెడితే ధనం పెరుగుతుందంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్న బెంగళూరు ముఠాను శనివారం సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రెయిన్ బజార్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి రూ. 1.35 లక్షలు నగదుతోపాటు ఒక రాగి చెంబు, బ్లాంక్ పేపర్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ ఎజాజ్ ఖాన్ (24) బట్టల వ్యాపారి. కాగా ప్యాట్నీ సెంటర్‌లో పని నిమిత్తం వచ్చిన ఆయనకు ప్రవీణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు బెంగళూరులో ఇద్దరు మిత్రులున్నారని, వారి వద్ద పురాతన కాలం నాటి రాగి పాత్ర ఉందని, అందులో డబ్బులు పెడితే రెట్టింపవుతున్నాయని నమ్మబలికాడు. దీంతో మహమ్మద్ ఎజాజ్ తన వద్ద ఐదు లక్షలు ఉన్నాయని వారిని హైదరాబాద్‌కు రప్పించాలని కోరాడు. దీంతో ప్రవీణ్ అక్టోబర్ 17న రవి, శ్రీనివాస్ అనే ఇద్దరిని హైదరాబాద్‌కు రప్పించాడు. పథకం ప్రకారం ముందుగా రాగి చెంబులో ఒక వెయ్యి నోటును వేసి నల్లబరచి, దానిని తెల్లగా మార్చి చూపెట్టారు. దీంతో నమ్మిన ఎజాజ్ ఖాన్ తన చెల్లెలి పెళ్లికి దాచుకున్న రూ. 5 లక్షలు రెండింతలు చేయాల్సిందిగా వారికి ఇచ్చాడు. దీంతో వారు దృష్టి మరల్చి సదరు నగదుతో పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాకుత్‌పురా రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వీరి ముఠాలోని వి శ్రీనివాస్, రవీంద్రనాథ్, నరసింహప్ప, మక్సూద్ అహ్మద్ ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేయగా, రాజగోపాల్, చంద్ర పరారీలో ఉన్నారు. పరారీలోని వీరికోసం గాలిస్తున్నట్టు డిసిపి సత్యనారాయణ తెలిపారు.