రంగారెడ్డి

నిరుద్యోగ సమస్య గత ప్రభుత్వాల వైఫల్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం: ప్రస్తుతం తలెత్తుతున్న నిరుద్యోగ సమస్యకు గత ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక సెయింట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎంకెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థుల శిక్షణ శిబిరానికి హాజరై ఉద్యోగార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడానికి గత ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని అన్నారు. తెరాస ప్రభుత్వం తాజాగా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువరిస్తున్నదని చెప్పారు. దీనిని ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఉద్యోగాలకు సన్నద్ధం కావాలని అన్నారు. ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సన్నద్దం చేయాలనే దృక్పథంతో ఎంకెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 430 మందికి శిక్షణ ఇస్తున్నామని, వారిలో సగం మందైనా ఉద్యోగాలు సంపాదించుకోవాలని అన్నారు. క్రమశిక్షణతో విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్దంగా ఉద్యోగాలకు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఎల్లప్పుడు ముందుంటానని తెలిపారు. డిఎస్సి అభ్యర్థులకు కూడా శిక్షణ ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మండల పరిషత్ అధ్యక్షుడు మర్రి నిరంజన్‌రెడ్డి, తెరాస నాయకుడు, సెయింట్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైందని అన్నారు. ఉద్యోగార్థులు పూర్తి స్థాయిలో పట్టుదలతో ఉద్యోగాలకు సన్నద్దమయ్యి, ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ జగదీశ్వర్, తెరాస నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, మొద్దు అంజిరెడ్డి, సతీష్‌ముదిరాజ్, బోసుపల్లి వీరేష్, ఈర్లపల్లి వెంకట్‌రెడ్డి, దండుమైలారం ఎంపిటిసి వెంకటేష్, జెర్కొని రాజు, ఉద్యోగార్థుల శిక్షకులు బాష పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణను బాధ్యతగా నిర్వర్తించాలి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22: హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని అటవీశాఖ అడీషనల్ పిసిసిఎఫ్ మలైస్య సూచించారు. సోమవారం స్థానికంగా పర్యటించి ఖానాపూర్ నుండి యాచారం మండలం మాల్ వరకు సాగర్ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను జిల్లా డిఎఫ్‌ఓ హరికుమార్, నల్గొండ జిల్లా డిఎఫ్‌ఓ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. వేసవి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో నీటిని అందివ్వాలని అన్నారు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తు చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ సామాజిక వనవిభాగం శ్రేణి అధికారిణి వెంకట్రామమ్మ, సాంకేతిక సహాయకుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

శాస్తవ్రేత్తల సూచనల మేరకే పంటలు వేయాలి
శామీర్‌పేట, ఫిబ్రవరి 22: శాస్తవ్రేత్తల సూచనల మేరకే రైతులు తమ పంటలు వేయాలని రాజేంద్రనగర్ ఎడిఎ దేవీ రేఖ అన్నారు. అలియాబాద్ గ్రామంలో రైతు అవగాహన సదస్సుకు సోమవారం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించుకొని స్థానిక వ్యవసాయ శాస్తవ్రేత్తలు, అధికారుల సలహాలు, సూచనల మేరకే పంటలను వేయాలని అన్నారు. భూసార పరీక్షలు నిర్వహించుకోకుండా తమ ఇష్టానుసారంగా పంటలను సాగు చేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీటి కొరత అధికంగా ఉండే అవకాశం ఉందని అందుకోసం రైతులు ప్రత్యామ్నయ చర్యలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో కానీ ఇతర మరే ఇతర కాలంలోనైనా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉందని అందుకోసం రైతులు 25 కేజీల చొప్పున అన్ని రకాల పప్పు దాన్యాలను సిద్ధం చేసుకొని అకాల వర్షాలు సంభవించినప్పుడు విత్తుకొని వాటి ద్వారా వచ్చిన మొలకను అదే పంటలో తొక్కుకుంటే పంటలకు మంచి ఎరువుగా ఏర్పడి రైతులు తమ పంటలను అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. మండల వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను వేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ గ్రామ సర్పంచ్ గౌరీకుమారి, వ్యవసాయ విస్తర్ణ అధికారి శ్రీలేఖ పాల్గొన్నారు.

నిరుద్యోగ సమస్య గత ప్రభుత్వాల వైఫల్యమే
ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22: ప్రస్తుతం తలెత్తుతున్న నిరుద్యోగ సమస్యకు గత ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక సెయింట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎంకెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థుల శిక్షణ శిబిరానికి హాజరై ఉద్యోగార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడానికి గత ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని అన్నారు. తెరాస ప్రభుత్వం తాజాగా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువరిస్తున్నదని చెప్పారు. దీనిని ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఉద్యోగాలకు సన్నద్ధం కావాలని అన్నారు. ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సన్నద్దం చేయాలనే దృక్పథంతో ఎంకెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 430 మందికి శిక్షణ ఇస్తున్నామని, వారిలో సగం మందైనా ఉద్యోగాలు సంపాదించుకోవాలని అన్నారు. క్రమశిక్షణతో విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్దంగా ఉద్యోగాలకు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఎల్లప్పుడు ముందుంటానని తెలిపారు. డిఎస్సి అభ్యర్థులకు కూడా శిక్షణ ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మండల పరిషత్ అధ్యక్షుడు మర్రి నిరంజన్‌రెడ్డి, తెరాస నాయకుడు, సెయింట్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైందని అన్నారు. ఉద్యోగార్థులు పూర్తి స్థాయిలో పట్టుదలతో ఉద్యోగాలకు సన్నద్దమయ్యి, ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ జగదీశ్వర్, తెరాస నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, మొద్దు అంజిరెడ్డి, సతీష్‌ముదిరాజ్, బోసుపల్లి వీరేష్, ఈర్లపల్లి వెంకట్‌రెడ్డి, దండుమైలారం ఎంపిటిసి వెంకటేష్, జెర్కొని రాజు, ఉద్యోగార్థుల శిక్షకులు బాష పాల్గొన్నారు.