తెలంగాణ

నోట్ల రద్దుతో ఊహించని దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు ఊహించని దెబ్బ తగిలింది. ఆదాయం గణనీయంగా తగ్గింది’ అని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి అనుకుంటే నోట్ల రద్దుతో మొత్తం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో పాటు నెలకు దాదాపుగా 15 వందల కోట్ల నుంచి 2 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం పడిపోతోందని, ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. నల్లధనం నిర్మూలనకు ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా సరైన వ్యూహంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపడితే బాగుండేదని అన్నారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాన్ని ముఖ్యమంత్రిగా కెసిఆర్ కేంద్రానికి వివరించారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదని తేలడంతో తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించడం బాగానే ఉంటుందని, అయితే భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నందున ఈ రెండింటిపై దృష్టిసారించామని కెటిఆర్ తెలిపారు. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని సూచించారు. సిద్దిపేటను ప్రయోగాత్మకంగా నగదు రహిత నియోజక వర్గంగా ఎంపిక చేశామన్నారు. తమ డబ్బుకు ఎలాంటి ఢోకా లేదు అనే నమ్మకం ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తామని కెటిఆర్ చెప్పారు.