తెలంగాణ

జైళ్లకు పటిష్ఠ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ జైళ్లశాఖ జైళ్లకు పటిష్ట భద్రతకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా జైళ్లలో సిసి కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించింది. గత నెలలో మధ్యప్రేశ్‌లోని భోపాల్ జైలు నుంచి టెర్రరిస్టులు పారిపోవడం, పంజాబ్‌లోని నభ జైలు నుంచి ఖైదీలు పారిపోయిన నేపథ్యంలో తెలంగాణలో జైళ్ల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భోపాల్, నభ లాంటి సంఘటనలు తెలంగాణలో చోటుచేసుకోవకపోయినా జైళ్ల భద్రతకు ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయించింది. ఇంకా కొన్ని నిధులు విడుదల చేయాల్సి ఉందని జైళ్లశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణ జిల్లాలోని 50 జైళ్లలో మూడు కేంద్ర కారాగారాలు, ఏడు జిల్లాల్లో ప్రత్యేక జైళ్లతోపాటు సబ్ జైళ్లు ఉన్నాయి. ఈ జైళ్లలో 6,214 మంది ఖైదీలు పలు నేరాల కింద శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో 30 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, కాగా 500 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు. ఈ జైళ్ల భద్రకు మొత్తం 1900 మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇంకా 500 పోస్టులు భర్తీ కావాల్సి ఉందని జైళ్లశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా ప్రతి జిల్లా కేంద్ర కారాగారానికి 150 సిసి కెమెరాలు అవసరం కాగా, ఏడు జిల్లాలకు కేవలం వంద కెమెరాలే ఏర్పాటు చేయబడ్డాయి. మంజూరైన నిధులను విడుదల చేస్తే జైళ్లలో భద్రత పెంచి, కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అధికారులు అంటున్నారు. అదేవిధంగా కోర్టుల్లో జైళ్లశాఖ అధికారులపై పలు ఆరోపణలున్నాయి. న్యాయమూర్తులు ఈ విషయమై సీరియస్‌గా తీసుకుంటున్నారు. జైళ్లలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయమూర్తులు సూచిస్తున్నారు. దీంతో జైళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తే ఘటనలపై విచారణ జరిపి దోషులెవరో తేల్చవచ్చని న్యాయమూర్తులు చెబుతున్నారని జైళ్లశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.