తెలంగాణ

టోల్‌గేట్లలో ‘చిల్లర ’కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 3: పెద్ధనోట్ల రద్ధు పిదప శనివారం తెల్లవారుజాము నుండి మళ్లీ టోల్ టాక్స్ వసూళ్లు చేస్తుండటంతో వాహనాదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు మొదలయ్యాయ. దీంతో టోల్ ప్లాజాల వద్ధ పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. తొలిసారిగా స్వైప్ మిషన్లు వాడినా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టోల్‌టాక్స్ చెల్లింపులు ప్రవేశపెట్టినా టోల్‌ఫ్లాజాల వద్ధ సమస్యలు మాత్రం తీరలేదు. నల్లగొండ జిల్లా పరిధిలో విజయవాడ-హైద్రాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ధ, కేతెపల్లి మండలం కోర్లపాడు టోల్ ఫ్లాజా వద్ధ శనివారం తెల్లవారుజాము నుండే టోల్‌టాక్స్ చెల్లింపు ప్రక్రియలో సరిపడ చిల్లర లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. స్వైప్ మిషన్లు మొరాయించడం, ఆన్‌లైన్ చిక్కులతో పాటు ఎక్కువగా 2వేల నోట్లు ఇవ్వడంతో తిరిగి వారికి చిల్లర చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో చిల్లర మీరంటే మీరే ఇవ్వాలంటు వాహనాదారులు, టోల్ ఫ్లాజా నిర్వాహకుల మధ్య తగాదాలతో ట్రాఫిక్ కొనసాగింపుకు మరింత అవాంతరం ఏర్పడింది.
అటు యాదాద్రి జిల్లా పరిధిలో హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి 163పై బీబీనగర్ మండలం గూడూరు టోల్ ఫ్లాజా వద్ధ, నార్కట్‌పల్లి-అద్దంకి రోడ్డు మార్గంలో మాడ్గులపల్లి టోల్ ఫ్లాజావద్ధ సైతం స్వైప్ మిషన్లు సరిగా పనిచేయకపోవడం, 2వేల నోట్లకు చిల్లర లభించకపోవడం సమస్యగా మారి ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. 10లక్షల మేరకు చిల్లర డబ్బులు పెట్టుకున్నామని సమస్యలు ఉండబోవంటు పలికిన టోల్‌ఫ్లాజా నిర్వాహకులు అవసరాల మేరకు చిల్లర సిద్ధం చేసుకోకపోవడం ఆయా మార్గాల్లో తమకు తమకు చిల్లర కష్టాలకు, ట్రాఫిక్ జామ్‌కు కారణమైందని వాహనాదారులు వాపోయారు. అసలు ఈ సమస్యలన్నింటికంటే 500నోట్లు, 100నోట్లు సరిపడే వచ్చేదాకా మరికొన్ని రోజులు టోల్‌టాక్స్ చెల్లింపు మినహాయించి ఆ మేరకు టోల్‌ఫ్లాజా నిర్వాహకులకు ప్రత్నామ్నాయ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని వాహనాదారులు అభిప్రాయపడ్డారు.

చిత్రం..చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు