తెలంగాణ

నకిలీ ఐటి అధికారుల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి ఓ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను లంగర్‌హౌజ్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వికారాబాద్‌కు చెందిన మహమ్మద్ సల్మాన్ పాషా నోట్లు మార్చుకోవడానికి గత నెల 25న నగరానికి వచ్చాడు. వరుసకు అన్న అయిన షరియార్ ఇంట్లో ఉంటూ, 26న రూ. 9.20లక్షలు తన స్నేహితుల వద్ద మార్పిడి చేసుకున్నాడు.
స్నేహితులు షకీల్, కృష్ణతో కలసి అతని కారులో టోలిచౌకి బయల్దేరారు. మార్గం మధ్యలో కారు చెడిపోయింది. ఓ మెకానిక్‌ను తీసుకురావాలని తన అన్న షరియార్‌కు ఫోన్ చేశాడు. దీంతో అతను ముస్త్ఫా అనే ఓ మెకానిక్‌ను తీసుకువచ్చి రిపేరు చేయించాడు. వికారాబాద్‌కు బయలుదేరే ముందు భోజనం చేద్దామని లంగర్‌హౌజ్‌లోని హోటల్ బావర్చికి చేరుకున్నారు. అదే సమయంలో మరో కారులో కొందరు వచ్చి తాము స్పెషల్ ఆపరేషన్ టీం, ఐటి అధికారులమని బెదిరించి మహమ్మద్ సల్మాన్ పాషా వద్ద ఉన్న రూ. 9.20 లక్షలు తీసుకుని పరారయ్యారు.
దీంతో సల్మాన్ లంగర్‌హౌజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 6.80 లక్షలు నగదు, ఓ కారు, రెండు ఫోన్లు, 15 ఐటి అధికారులుగా ముద్రించుకున్న విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు.