తెలంగాణ

వెంటిలేటర్‌పై కాంగ్రెస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్‌కు జీవం పోయాలని కోదండరామ్ ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్ , శ్రీనివాస్‌రెడ్డిలు విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కోదండరామ్‌ను జెఎసి చైర్మన్‌గా చేసిందే కెసిఆర్ అని, తెలంగాణ ఉద్యమ నాయకునిగా కెసిఆర్ జెఎసిని ఏర్పాటు చేసి కోదండరామ్‌ను చైర్మన్‌ను చేసిన తరువాతే ఆయన పేరు తెలిసిందని అన్నారు. జెఎసి చైర్మన్‌గా కాంగ్రెస్‌తో కలిసి ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కోదండరామ్ ప్రయత్నించారని, విషయం తెలిసినా ఈ వాస్తవాన్ని ప్రజలతో తాము పంచుకోలేదని అన్నారు. కోదండరామ్‌ను అడ్డు పెట్టుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బాల్కసుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ శిఖండి రాజకీయాలు మానుకోవాలని అన్నారు.
నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడుతున్నారని, ఆయన మరోసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశమే లేదని అన్నారు. కెటిఆర్ మంత్రి అని, ఉద్యమ కాలంలో అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యమంలో చేరారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా మంత్రిగా బదులు చెబుతారని అన్నారు. కెటిఆర్ కృషి వల్లనే అనేక రంగాల్లో తెలంగాణకు అవార్డులు వచ్చాయని అన్నారు. కమిట్‌మెంట్‌తో తెలంగాణ కోసం పని చేస్తున్న కెటిఆర్‌తో కోదండరామ్‌కు పోలిక లేదని అన్నారు. కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని తాము ముందు నుంచి చెబుతున్నామని, కోదండరామ్‌ను విమర్శిస్తే కాంగ్రెస్, టిడిపి నేతలు సమాధానం చెబుతున్నారంటే తమ వాదనకు బలం చేకూరిందని బాల్క సుమన్ అన్నారు.
ఆంధ్ర అజెండాను రుద్దే ప్రయత్నం
విపక్షాలు ఆంధ్ర అజెండాను తెలంగాణపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారితో కోదండరామ్ కలిసి పని చేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా కెటిఆర్ సాదాసీదాగానే ఉన్నారని ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ అజెండాను కోదండరామ్ భుజాన వేసుకున్నారని విమర్శించారు.
కోదండరామ్ విపక్షాల చేతిలో కీలుబొమ్మగా మారారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కోదండరామ్‌కు కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు అనేది అపోహ మాత్రమేనని, కోదండరామ్ తన కుమారుడి వివాహానికి రావాలని కెసిఆర్‌ను కలిసి కోరారని గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను స్వామినాథన్ మెచ్చుకున్నారని, కానీ కోదండరామ్ లాంటి వారు మాత్రం విమర్శిస్తున్నారని అన్నారు.