తెలంగాణ

విద్యుత్ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. 14 విద్యుత్ సంఘాలు సమ్మెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యంతో చర్చలు సఫలం కావడం వల్ల సమ్మెను విరమిస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దశల వారిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మార్చి 31 లోగా మార్గదర్శకాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. జెన్‌కో ఉద్యోగులకు 12 శాతం స్పెషల్ అలవెన్స్ చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. విద్యుత్ సంఘాలు, యాజమాన్యాల మద్దతు కుదిరిన ఒప్పందంపై ముఖ్యమంత్రి వద్ద సోమవారం మరోసారి సమావేవం అవుతారు. ఈ సమావేశంలో మార్గదర్శకాలపై కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు యాజమాన్యం, విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. యాజమాన్యం తరఫున జెఎండి సి శ్రీనివాసరావు, టిజెన్‌కో డైరెక్టర్ ఎస్ అశోక్ కుమార్, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్ కమాలుద్దీన్ అలీ ఖాన్ ఉద్యోగుల తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కె సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె ప్రకాశ్ సంతకాలు చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్, టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లో దశల వారిగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఇప్పుడున్న ఖాళీలతో పాటు 8800 సబ్ స్టేషన్ ఆపరేటర్స్ పోస్టులను ప్రభుత్వం ఇంతకు ముందు మంజూరు చేసింది. వీటిని దశలవారిగా భర్తీ చేయనున్నారు.