తెలంగాణ

జన సమ్మర్దంలో బైక్ రేసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: బైక్ రేసింగ్‌లు అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇటీవల పివి ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ఘటన మరువకముందే తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ బైక్ రేసర్ రెచ్చిపోయాడు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం 3లో నదీమ్ అనే బైక్ రేసర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపాల్ అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడిక్కడే మృతి చెందగా, నదీమ్‌కు గాయాలయ్యాయి. గోపాల్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, గాయపడిన నదీమ్‌ను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.