తెలంగాణ

చెరకు మద్దతు ధర టన్నుకు 4 వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: రైతులకు టన్ను చెరకుకు 4 వేల రూపాయల కనీస మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కర్నాటకలో టన్ను చెరకుకు 3600 రూపాయలు చెల్లిస్తున్నారని, మహారాష్టల్రో 3500 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు కష్టపడి పంట పండిస్తే వారికి కనీస మద్దతు ధర లభించడం లేదని ఆయన తెలిపారు.