తెలంగాణ

రేషన్ సరకులకూ జిపిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా జిపిఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు పౌర సరఫరాలశాఖ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. సరుకులు గోదాం నుంచి బయలుదేరి చౌకధరల దుకాణాలకు చేరేవరకు పటిష్ఠమైన నిఘా ఉంటుందన్నారు. పౌరసరఫరాల భవన్‌లో ఆదివారం రేషన్ సరుకుల చేరవేసే కాంట్రాక్టర్లతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ, సరుకుల రవాణ చేసే వాహనాలకు జిపిఎస్ పరికరాలు అమర్చి ఉండటంతో ఈ వాహనాలు ముందస్తు సమాచారం లేకుండా జిల్లా పరిధిదాటి వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రతి వాహనానికి ఒకే ఫోన్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుమతి లేకుండా వాహనాలు జిల్లా పరిధిదాటి బయటికి వెడితే నిబంధనల అతిక్రమణ కింద గుర్తించి కాంట్రాక్టర్‌పై చర్య తీసుకుంటామన్నారు. తమ వాహనాలు ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు రవాణా కాంట్రాక్టర్లకు ప్రత్యేక ఐడి, పాస్‌వర్డ్ ఇస్తామన్నారు. ఇకనుంచి పూర్తిస్థాయిలో జిపిఎస్ విధానం అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం ఏమీ ఉండదని, నష్టం కంటే లాభమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ విధానానికి కాంట్రాక్టర్లు సహకరించని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. క్రికెట్ టీమ్‌లో 11 మంది ఆటగాళ్లు ఉంటారు, అందులో ఏ ఒక్కరు సరిగా ఆడకపోయినా తదుపరి మ్యాచ్‌లో వారికి అవకాశం ఉండదని, సరుకుల కాంట్రాక్టర్లకు ఇదే వర్తిస్తుందని కమిషనర్ గుర్తు చేశారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు, కిరోసిన్ డీలర్లు, అధికారులు, సిబ్బందితో వరుసగా సమావేశాలు నిర్వహించడం వల్ల పౌరసరఫరాశాఖలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇక నుంచి కాంట్రాక్టర్లకు రవాణా చార్జీల చెల్లింపుల లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామన్నారు. సరుకుల రవాణా కాంట్రాక్టుల వ్యవధి ప్రస్తుతం ఏడాది మాత్రమే ఉందని, దీనిని రెండు సంవత్సరాలకు పెంచాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా, పనితీరు బాగున్న కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రెండు సంవత్సరాలకు పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. తమ నుంచి హమాలీలు ఇష్టానుసారంగా లేబర్ చార్జీలను వసూలు చేస్తున్నారని, లోడింగ్, ఆన్‌లోడింగ్‌లకు చార్జీలను ప్రభుత్వమే ఖరారు చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..అధికారులతో పౌర సరఫరాలశాఖ కమిషనర్ సివి ఆనంద్