తెలంగాణ

హైదరాబాద్‌లో 15నుండి జాతీయ పుస్తక మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: జాతీయ పుస్తక మహోత్సవాన్ని ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకూ హైదరాబాద్ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి కె చంద్రమోహన్‌లు తెలిపారు. ప్రతి రోజు మధ్యా హ్నం 2 గంటల నుండి సాయంత్రం 8.30 వరకూ జరుగుతుందని అన్నారు. హైదరాబాద్‌లో గత 30 సంవత్సరాలుగా పుస్తక ప్రదర్శనలు జరుగుతున్నాయని, పుస్తకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు, విద్యార్థుల్లో పుస్తకపఠనం పెంచేందుకు, రచయితలు కవులు, పుస్తక ప్రియులను అనుసంధానం చేసేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కృషి చేస్తోందని అన్నారు. 1985లో హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పడిన నాటి నుండి ఆదరణ పొందుతోందని, జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 250 పబ్లిషర్స్, రచయితలు రాబోతున్నారని వారు చెప్పారు. హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యం, సాంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జాతీయ పుస్తక మహోత్సవ ప్రారంభానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరవుతారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు హాజరవుతారని వివరించారు.
కనీస వేతనాల మండలి
చైర్మన్‌గా వెంకన్న
ఉత్తర్వుల జారీకి కెసిఆర్ ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌గా సామ వెంకన్న (వెంకట్‌రెడ్డి)ను నియమిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
జయలలిత ఆరోగ్యంపై సిఎం ఆరా
ఇదిలావుంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావుకు కెసిఆర్ ఫోన్ చేసి ఆమె కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆధునిక టెక్నాలజీతో
ఫ్రెండ్లీ పోలీసింగ్
ప్రజలతో కాఖీల మమేకం
పారదర్శకంగా సేవలు
నేరాల అదుపులో సత్ఫలితాలు

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రజా భద్రతే ధ్యేయంగా తెలంగాణ పోలీసులు ముందుకుసాగుతున్నారు. ఇందులో భాగంగానే టెక్నాలజీని సమకూర్చుకోవడానికి పోలీస్ శాఖకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌తో నేర నియంత్రణలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. నేరాలను అదుపు చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, రెండున్నరేళ్లలో నేరాలు తగ్గిస్తూ, శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు తమదైన ముద్ర వేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీతో పెట్రోలింగ్ వ్యవస్థను ఆధునీకరించి సిబ్బందిలో జవాబుదారీతనం పెంచారు. పెట్రోలింగ్ వాహనాలకు జిపిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. హాక్ ఐ, హైదరాబాద్ కాప్స్, లాస్ట్ రిపోర్టు, స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్ యాప్, సోషల్ మీడియాలోని వాట్సాప్, ఫేస్ బుక్‌లతో ప్రజలకు మరింత చేరువయ్యారు. పోలీస్ స్టేషన్లలో రిసిప్షెన్ వ్యవస్థను పటిష్టం చేసి, సిబ్బందిలో మార్పు తెచ్చి సామాన్య ప్రజలతో మమేకమై, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మెరుగైన సేవలు అందిస్తున్నారు. నేరాల నివారణకు క్రైమ్ మ్యాపింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. మిస్సింగ్ సర్ట్ఫికెట్ల కోసం పోలీస్ స్టేషన్లకు రాకుండా, నేరుగా మిస్సింగ్ సర్ట్ఫికెట్లు పొందేందుకు లాస్ట్ రిపోర్ట్ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవడంతో సాధారణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశ్వనగర్‌లో 13న
దత్తజయంతి వేడుకలు

గుంటూరు, డిసెంబర్ 5: మార్గశిర పౌర్ణమి గురుదత్త జయంతి సందర్భంగా విశ్వగురు పీఠంలో ఈ నెల 13న దత్తజయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు. విశ్వగురు పీఠాధిపతి శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ దివ్య ఆశీస్సులతో విశ్వశాంతికి, ప్రకృతి వైపరీత్యాల నుండి భూమాతను పరిరక్షించుకునేందుకు, సకల మానవుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా సామూహిక లక్ష తులసీ దళాలు, లక్ష పుష్పాలతో దత్తాత్రేయ స్వామికి విశిష్ఠ అర్చనలు జరుగుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జన్మించిన పవిత్ర పర్వదినాన్ని దత్తజయంతిగా పాటిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విశ్వనగర్‌లో దత్తజయంతి మహోత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి వేదపఠనం, మంత్ర పారాయణ, గోపూజ, రుద్రాక్ష, కుంకుమార్చన, లక్షతులసీ దళార్చన, మారేడుదళ సహిత నానావిధ లక్షపుష్పార్చన వంటి ప్రత్యేక పూజలు, సామూహిక దత్తవ్రతం ఈ ఏడాది ప్రత్యేకతలని గురుపీఠం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ‘్భమాత సంరక్షణలో మేధావుల పాత్ర’ అంశంపై చర్చాగోష్టి నిర్వహిస్తారు. దత్తజయంతి సందర్భంగా స్వామీజీ ఆశీపూర్వక అనుగ్రహభాషణ చేస్తారు.
టి-ఎమ్సెట్ లీకేజీలో
మరో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన శృతికేష్ కుమార్ (39), అజయ్‌కుమార్ (44), రాజేష్‌కుమార్ (36)లను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 2.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు విద్యార్థులకు షిర్డీలో క్యాంప్ నిర్వహించిన నిందితులు ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు సిఐడి ఐజి సౌమ్యమిశ్రా తెలిపారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడిగా పనిచేస్తున్న శృతికేష్ కుమార్ ఏడుగురు విద్యార్థులను, రియల్ ఎస్టేట్ వ్యాపారి అజయ్‌కుమార్ ఏడుగురిని, కెనరా బ్యాంక్ ఉద్యోగి రాజేష్‌కుమార్ నలుగురిని సమీకరించి అజయ్‌కుమార్‌కు అప్పగించగా కోల్‌కత, షిర్డీల్లో వీరికి ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు సిఐడి ఐజి వివరించారు.

శాసనసభలో
తేల్చుకుందాం
విపక్షాలకు ఓపిక ఉన్నంత వరకు సమావేశాలు : తెరాస

హైదరాబాద్, డిసెంబర్ 5: విపక్షాలకు ఒప్పిక ఉన్నంత వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు పారిపోకుండా చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ చేశారు. మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రకటిస్తే, కాంగ్రెస్ నాయకులు తక్షణం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ వద్ద ధర్నా పేరుతో డ్రామా ఆడారని విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఈనెల మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నందున ఉభయ సభల్లో ఏం మాట్లాడతారో మాట్లాడండి సభలోనే తేల్చుకుందాం అని అన్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులపై చర్చించేందుకు తక్షణం సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. నోట్ల రద్దుపై చర్చించడానికి పార్లమెంటు సరైన వేదిక అని పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ ఉపయోగించుకోవడం లేదని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ అని తెలిపారు. ప్రధాని ఆహ్వానంతో ఢిల్లీ వెళ్లి కెసిఆర్ సమస్యను ప్రధానమంత్రికి వివరించారని తెలిపారు. రైతులను ఆదుకోవడానికే పాత నోట్లతోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కెసిఆర్ కోరడం వల్లనే అవకాశం ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంగా ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో వాటిని తీసుకున్నట్టు తెలిపారు. మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసిన తరువాత కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ వద్ద ధర్నా నాటకం ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. చట్టసభలో ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని అన్నారు.