తెలంగాణ

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంటసేపు సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నెల మూడవ వారంలో వారం రోజుల పాటు శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాల నిర్వహణపై గవర్నర్‌కు వెల్లడించినట్టు తెలిసింది. అలాగే కలెక్టర్లతో ఈ నెల 14న నిర్వహించబోయే సమావేశంపై కూడా గవర్నర్‌కు చెప్పినట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రాష్ట్ర ఆదాయ వనరులకు వాటిల్లిన నష్టాన్ని వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇటీవల విడుదల చేసిన రూ.1800 కోట్లతో కొంత ఉపశమనం లభించినట్టు అయిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు తెలిసింది. రాష్ట్రంలో తగ్గిన ఆదాయం వల్ల ఎదురయ్యే పరిస్థితిని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటాలో గత నెలలో కోత విధించిన రూ.600 కోట్లను కూడా విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి, ముఖ్యంగా ప్రధానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపినట్టు తెలిసింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణాలలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది.

చిత్రం..రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్