తెలంగాణ

నాడు ఉద్యమకారులు.. నేడు ద్రోహులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో కీలకపాత్ర పోషిస్తూ తెలంగాణ జాతిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన సమయంలో వారు ఉద్యమకారులు..నేడేమో వారు ద్రోహులా అంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభ పక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ అవలంభిస్తున్న వైఖరి, వైఫల్యాలపై మాట్లాడితే చాలు వారిని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలను, ప్రజలను ఒకేతాటిపైకి తీసుకువచ్చిన పొలిటికల్ జెఏసి కన్వీనర్ కోదండరామ్. ఆటపాటలతో జనాన్ని చైతన్యపర్చిన టఫ్ నేత విమలక్క ద్రోహులా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఏనాడు మాట్లాడని, పోరాడని మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, తుమ్మల నాగేశ్వర్‌రావు సిఎంకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ రెండున్నరేళ్ల పాలనలో మద్యం అమ్మకాల్లో తప్ప ఎందులోనూ ప్రగతి సాధించలేదని విమర్శించారు. రైతుల రుణ మాఫీ మూడవ విడతకు సంబంధించి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమకాలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. కరువు మండలాలను గుర్తించలేదని, గుర్తించిన కరువు మండలాలకు కేంద్రం విడుదల చేసిన రూ.720 కోట్లను రైతులకు ఇవ్వకుండా దారిమళ్లీంచిందని ఆరోపించారు. ఉద్యమ నాయకుడిగా చెప్పుకునే సిఎం కెసిఆర్ ఆత్మరక్షణలో పడ్డారని, ప్రాణభయంతోనే ఆయన బుల్లెట్ ప్రూఫ్ బాత్‌రూంను నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల పోరు, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన ప్రస్తుత పాలకుల తీరు తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన చందంగా ఉందని దుయ్యబట్టారు. రాచరిక, కుటంబపాలన సాగిస్తే ప్రజలు ఊరుకోబోరని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ విఫ్ ఆరెపల్లి మోహన్, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌రావు, నాయకులు కర్ర రాజశేఖర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి