తెలంగాణ

ఇబ్రహీంపూర్ నగదు రహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సిద్ధిపేట, డిసెంబర్ 5: తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ దేశంలోనే రెండవ నగదురహిత గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా నిలిచింది. వంద శాతం నగదురహిత కార్యకలాపాల ద్వారా దేశంలో రెండవ గ్రామంగా రికార్డు సృష్టించింది. సిద్దిపేట నియోజక వర్గం పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని మంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు. హరితహారం వంటి అనేక అంశాల్లో రికార్డు సృష్టించిన ఈ గ్రామం ఇప్పుడు తాజాగా వంద శాతం నగదురహిత కార్యకలాపాల ద్వారా దేశంలోనే రెండవ గ్రామంగా రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోని అకోదర గ్రామం దేశంలో తొలి నగదురహిత గ్రామంగా రికార్డు సృష్టించింది. ఐసిఐసిఐ బ్యాంకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత 2015లో దేశంలో తొలి నగదురహిత గ్రామంగా నిలిచింది. గుజరాత్‌లోని అకోదర గ్రామానికి సిద్దిపేట నియోజక వర్గంలోని ఇబ్రహీంపూర్‌కు అనేక పోలికలు ఉన్నాయి. ప్రధానంగా జనాభా దాదాపు ఒకే విధంగా ఉంది. అకోదర జనాభా 1191 కాగా, ఇబ్రహీంపూర్ జనాభా 1200 మంది.
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తరువాత రాష్ట్రంలో నగదురహిత ఆర్థిక కార్యకలాపాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట నియోజక వర్గాన్ని నగదురహిత నియోజక వర్గంగా తీర్చి దిద్దాలని నిర్ణయించారు. మంత్రి హరీశ్‌రావు నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నగదురహిత కార్యకలాపాల కోసం ప్రోత్సహిస్తున్నారు. బ్యాంకులు సైతం అవసరం అయిన సహకారం అందిస్తున్నాయి. నగదురహిత కార్యకలాపాలకు అవసరం అయిన యంత్రాలను బ్యాంకులు అందజేశాయి. దాంతో నియోజక వర్గంలో నగదురహిత కార్యకలాపాలను వేగంగా పెంచుతున్నారు. నియోజక వర్గంలో ఏ గ్రామం ముందుగా వంద శాతం నగదురహిత కార్యకలాపాలు నిర్వహిస్తే ఆ గ్రామ అభివృద్ధికి పది లక్షల రూపాయల మంజూరు చేయనున్నట్టు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇబ్రహీంపూర్ గ్రామం వంద శాతం నగదురహిత గ్రామంగా నిలిచిందని హరీశ్‌రావు ప్రకటించారు. దాంతో ఈ గ్రామానికి పది లక్షల రూపాయలు దక్కనున్నాయి. క్యాష్‌లెస్ సిద్దిపేటలో ఇబ్రహీంపూర్ తొలి గ్రామం అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కార్డు ద్వారా ఇంటింటికి మంచినీటిని ఇచ్చే ఏర్పాటు గ్రామంలో చాలాకాలం క్రితమే ప్రారంభించారు. ఇప్పుడు కార్డుతో బియ్యం, కిరోసిన్, పాలు, ఇతర నిత్యావసరాలు అన్నీ అందించే ఏర్పాటు చేశారు. కార్డు వాడడం ద్వారా ఐదులక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించారు. గ్రామంలోని యువకులు మార్పును ఉత్సాహంగా స్వీకరిస్తున్నారని చెప్పారు.

చిత్రం..ఇబ్రహీంపూర్ గ్రామం, ఆ గ్రామంలోని మహిళలతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు