తెలంగాణ

విత్తనోత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: అంతర్జాతీయంగా విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరిందని, విత్తనోత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘విత్తన నమూనా, స్వచ్ఛత, అంకురోత్పత్తి’ అంశంపై హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ఐదురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ, అంతర్జాతీయ ప్రమాణాల పరీక్ష అసోసియేషన్ (ఇస్తా) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించేందుకు వీలుగా అధిక దిగుబడి వచ్చే విత్తనాలను రైతులకు అందించాల్సి ఉందన్నారు. శాస్తవ్రేత్తలు ఈ అంశంపై ప్రత్యేకంగా పరిశోధన చేయాలన్నారు. స్వచ్ఛమైన, నాణ్యమైన విత్తనాలను ఉపయోగిస్తే నూటికి నూరు శాతం అంకురోత్పత్తి జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా రూపుదిద్దుతున్నామన్నారు. దేశంలో అవసరమైన విత్తనాల్లో 60 శాతం విత్తనాలు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 400 విత్తనోత్పత్తి కంపెనీలున్నాయని గుర్తుచేశారు. గత ఖరీఫ్‌లో 30 లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, రబీలో 20 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరిగిందని వివరించారు. ఈ ఉత్పత్తిని మరింత పెంచాలన్నదే తమ లక్ష్యమని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అంతర్జాతీయ విత్తన వ్యాపారంలో తెలంగాణ స్థానం సంపాదించుకున్నదని వ్యవసాయ కమిషనర్ ఎం. జగన్‌మోహన్ తెలిపారు.