తెలంగాణ

అన్నీ ఆన్‌లైన్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ఆసరా పథకం కింద పెన్షన్లను మొత్తం ఆన్‌లైన్‌లోనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వివిధ పెన్షన్ పథకాలకు నిధులు ఆన్‌లైన్‌లోనే చెల్లించడం గత నెల నుంచే ప్రారంభం అయింది. అయితే దాదాపు మూడు లక్షల ఖాతాలను మాత్రం ఇంకా ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేయలేదు. వృద్ధులు, వితంతువులు, బిడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు పదిహేను వందల రూపాయల పెన్షన్ చెల్లిస్తున్నారు. 30 లక్షల ఖాతాల వరకు ఆన్‌లైన్‌లోనే గత నెల నుంచి చెల్లిస్తున్నారు. ఆసరా పెన్షన్‌ల పంపిణీ మొత్తం ఇకపై నగదు రహితంగానే సాగాలని మంత్రి అధికారులకు తెలిపారు. గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సమీక్ష జరిపారు. 2008 అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం కార్యాచరణ రూపొందించారు. స్వచ్ఛ భారత్ మిషన్, ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో జాబితాలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.