తెలంగాణ

పెద్దనోట్ల రద్దుపై ఇంత రాద్ధాంతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పెద్ద నోట్లను రద్దు చేస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంత వరకూ సమంజసమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాంక్‌బండ్ వద్ద బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి బిజెపి నేతలు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేముల అశోక్ అధ్యక్షత వహించారు. డాక్టర్ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ఐదు ప్రదేశాలను పంచతీర్థాలుగా తీర్చిదిద్దేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని అన్నారు.