తెలంగాణ

ఎమ్మెల్యే కారుపై చెప్పులతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జఫర్‌గడ్, డిసెంబర్ 6: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమావేశం నిర్వహిస్తుండగా జఫర్‌గడ్ మండలాన్ని జనగామ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ జెఎసి నాయకులు, మహిళలు పెద్దఎత్తున ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు రాగా పోలీసులు వారిని కట్టడి చేయలేకపోవడంతో మహిళలు తప్పించుకొని ఎమ్మెల్యే సమావేశాన్ని అడ్డుకున్నారు. వెంటనే సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకొని వెళ్లిపోతున్న క్రమంలో మహిళలు పెద్దఎత్తున సభా ప్రాంగణానికి చేరుకొని ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. పోలీసులు వారిని తోసివేయడంతో ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్తున్న క్రమంలో మహిళలు ఒక్కసారిగా ఆ వాహనంపై చెప్పులు విసిరారు. అంతేకాకుండా జెఎసి నాయకులు ఎమ్మెల్యే రాజయ్య వస్తున్నాడని తెలుసుకొని ముందస్తుగా మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మహిళలు ఆ పోలీసు వాహనానికి అడ్డుతగలడంతో వారిని గాంధీసెంటర్‌కు తరలించారు. ప్రజాభిప్రాయాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే రాజయ్య వ్యక్తిగత స్వార్థం కోసం జనగామ జిల్లాలో జఫర్‌గడ్ మండలాన్ని కలపాలని, ఈ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలిపేంత వరకు ఎమ్మెల్యే రాజయ్యను మండలానికి రానిచ్చే ప్రసక్తే లేదని మహిళలు హెచ్చరించారు.