తెలంగాణ

కెసిఆర్ అహంకారానికి ప్రజలే గుణపాఠం చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా టిడిపి నేతలు అంబేద్కర్ ఫొటోకి పూలదండ వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మహిళల సంక్షేమం కోసం అంబేద్కర్ కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నాడు ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఆశయాలతో పార్టీని, ఎపి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారని ఆయన చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, ఇతర నాయకులు ఎం. అమర్‌నాథ్ బాబు, బుచ్చిలింగం తదితరులు ప్రసంగించారు.