తెలంగాణ

భాషల కనుమరుగుపై 9నుంచి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రపంచంలో ఆరువేల భాషలు కనుమరుగు అవుతుండగా, అందులో 42 భారతీయ భాషలు శాశ్వతంగా కనుమరుగయ్యే ముప్పు ఉందని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ సంస్థ తేల్చింది. దేశంలో మాట్లాడే భాషలు 380 ఉండగా అందులో 96 శాతం భాషలు సైతం కనుమరుగయ్యే ముప్పు ఉందని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వంద కోట్ల ప్రజల్లో నాలుగు శాతం ప్రజలు ఈ 96 శాతం భాషలను మాట్లాడుతున్నారు. కేవలం ఇళ్లల్లో మాత్రమే మాట్లాడే భాషలు, పెద్దలు మాట్లాడుతున్నా పిల్లలు నేర్చుకోని, మాట్లాడని భాషలు, ఎవరూ మాట్లాడని భాషలు అనే వర్గీకరణ చేసి ఇందులో ఎవరూ మాట్లాడని భాషలు వెనువెంటనే కనుమరుగయ్యే ప్రమాదం ఉండగా, మిగిలిన వర్గాలు మరికొంత కాలానికి కనుమరుగవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే గుర్తించిన కనుమరుగయ్యే భాషలను అభివృద్ధి చేసి పరిరక్షించేందుకు సిల్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో కనుమరుగయ్యే భాషలు, వాటి పరిరక్షణ, ఇబ్బందులు, తీసుకోవలసిన చర్యలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వార్షిక సదస్సును ఈ నెల 9 వ తేదీ నుండి 12వ తేదీ వరకూ నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం స్కూల్ ఆఫ్ హ్యూమనిటీస్‌లో జరుగుతుందని ఆ విభాగం డీన్ ప్రొఫెసర్ పంచనన్ మహంతి చెప్పారు. కనుమరుగయ్యే భాషల అధ్యయనానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ప్రత్యేకించి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సదస్సులో పాల్గొనేందుకు 20 మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నారని ఆయన చెప్పారు.