తెలంగాణ

ఎంత చేసినా ఎందుకీ వైఫల్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణలో గత రెండేళ్లలో అత్యధికంగా నిధులను మంజూరు చేయడమేగాక, పెద్ద ఎత్తున అధికారుల్లో కదలిక తీసుకువచ్చి పాఠశాల విద్యను పునర్వ్యవస్థీకరించినా, ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఎంత చేసినా ఎందుకీ వైఫల్యం అంటూ ప్రశ్నించారు. బిహార్‌కంటే ఫలితాల్లో వెనుకంజ వేయడం సరికాదని, రాష్ట్రంలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు మరోమారు తాజా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అక్షరాస్యతలో అగ్రభాగాన ఉంచాలన్న సిఎం కె చంద్రశేఖరరావు ఆలోచన మేరకు, వయోజన విద్యను బాగా అభివృద్ధి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ కార్యాచరణను రూపొందించింది. అక్షరాస్యతలో దేశ సగటు 74 శాతం కన్నా తెలంగాణ వెనుకబడి ఉందని, రాష్ట్ర అక్షరాస్యత సగటును 66 శాతం నుండి కనీసం 80 శాతానికి తీసుకువెళ్లాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా దేశంలో అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న త్రిపుర రాష్ట్రంలో అధ్యయనం చేయడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అధికారుల బృందం రెండు రోజుల పాటు పర్యటించేందుకు వెళ్లింది.
దేశంలో అత్యధిక అక్షరాస్యత శాతాన్ని సాధించడమేగాక, అక్కడ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అధ్యయనం చేసి వాటిని తెలంగాణలోనూ అమలుచేయడం ద్వారా సాక్షరతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
కాగా కడియం బృందం మంగళవారం సాయంత్రం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో జిల్లాకొక జవహర్ నవోదయ విద్యాలయాన్ని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను, డైట్ సెంటర్లను మంజూరు చేయాలని కోరారు.