తెలంగాణ

41 లేఖలు రాసినా సిఎం స్పందించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు 50 రోజుల్లో 41 లేఖలు రాసినా స్పందించలేదని సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డిజి నరసింహారావు విమర్శించారు.
‘సామాజిక న్యాయం - రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ అజెండాగా ఇబ్రహీంపట్నంలో అక్టోబర్ 17న తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు మహాజన పాదయాత్ర ప్రారంభించారని వారు మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ మహాజన పాదయాత్ర ఇప్పటికి 9 (కొత్త) జిల్లాల్లో 1250 కిలో మీటర్ల మేర సాగిందని చెప్పారు. ఈ సందర్భంగా తమ పార్టీ నేతల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి 41 లేఖలు రాయడం జరిగిందని అన్నారు. ఏ ఒక్క లేఖకూ ముఖ్యమంత్రి నుంచి స్పందన రాలేదని వారు తెలిపారు. వివక్షత, పెత్తందార్ల దోపిడీతో, పెన్షన్ల కోత, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, స్మశానవాటికలు, 3 ఎకరాల భూపంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల రుణ మాఫీ, గిట్టుబాటు ధర లభించకపోవడం, మైనారిటీల రిజర్వేషన్లు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలపై లేఖలు రాసినట్లు చెప్పారు.
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం (6న) అంబేద్కర్ వర్ధంతి నుంచి 15 వరకు మండల, పట్టణ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3న సావిత్రీబాయి ఫూలే జయంతి నుంచి 10 వరకు గ్రామాల్లో సైకిల్, వాహనాల యాత్రలు, గ్రూపు మీటింగ్‌లు, సమస్యల సేకరణ, జనవరి 15 నుంచి 30 వరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయడం, ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు రిలే నిరాహార దీక్షలు, 16 నుంచి మండల కేంద్రాల్లో ధర్నాలు, పికెటింగ్‌లు, 25న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, పికెటింగ్‌లు, మార్చి 12న లక్షలాది మందితో హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెరుపల్లి సీతారాములు, నరసింహారావు తెలిపారు.