తెలంగాణ

తెలంగాణను క్రీడల్లో నంబర్ వన్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 9: క్రీడలకు, క్రీడాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రానున్న రోజుల్లో దేశంలోనే తెలంగాణ క్రీడల్లో నంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌లోని మానేరు హైస్కూళ్లో జరిగిన 62వ అఖిల భారత పాఠశాలల క్రీడా సమాఖ్య జూడో పోటీల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేడు దేశంలో హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు క్రీడల్లో ముందంజలో నిలుస్తున్నాయని, ఇక భారత క్రీడల భవిష్యత్ ఆశాకిరణాలుగా తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. అందులో భాగంగా జాతీయ జూడో పోటీలకు కరీంనగర్ ఆతిథ్యమిస్తోందన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో ఆటగాళ్లకు ఏ విధమైన లోటు లేకుండా సకల సౌకర్యాలు కల్పించిన మానేర్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. మరో అతిథి, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా జాతీయ పోటీలను నిర్వహించలేకపోయామని, తెలంగాణ స్వరాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహించుకునే అవకాశం దక్కిందన్నారు. జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి పి.తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 25 రాష్ట్రాల నుంచి 500 మంది క్రీడాకారులు వచ్చారని, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు క్రీడలు అట్టహాసంగా ప్రారంభం కాగా, మంత్రి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి మార్చ్ఫాస్ట్‌లో పాల్గొన్న క్రీడాకారుల నుండి గౌరవవందనం స్వీకరించారు.