తెలంగాణ

ఆన్‌లైన్‌లో ముక్కోటి ఏకాదశి టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 9: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈసారి ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ప్రయోగాత్మకంగా తొలిసారి ఈ ప్రక్రియకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. మొత్తం నాలుగు వేల టిక్కెట్లలో 50 శాతం అంటే 2వేల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. మిగిలిన 50 శాతం టిక్కెట్లలో 25 శాతం దేవస్థానం, 25 శాతం రెవెన్యూ శాఖ ద్వారా విక్రయించనున్నారు. ఏటా శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి వేళల్లో అధికారుల పెత్తనంతో భక్తులకు దర్శన భాగ్యం కల్గడం లేదు. చివరి వరకు టిక్కెట్లను తమ వద్దనే ఉంచుకోవడం, చివరి క్షణంలో టిక్కెట్లు మిగిలాయనడం పరిపాటిగా మారింది. దీనివల్ల భక్తులకు అన్యాయం జరగడంతో పాటు దేవస్థానానికి కూడా టిక్కెట్లపై ఆదాయం తక్కువగా వస్తోంది. వివిఐపి, ఏ,బి,సి,డి,ఇ,ఎఫ్ సెక్టార్లుగా విభజించి టిక్కెట్లను కేటాయిస్తున్నారు. వివిఐపి టిక్కెట్ ధర రూ.1000లు. ఇవి 750 ఉంటాయి. ఏ నుంచి ఇ వరకు రూ.500ల టిక్కెట్లు. ఇవి 2580 ఉంటాయి. ఎఫ్ సెక్టార్ టిక్కెట్ ధర రూ.250లు. ఇవి 650 ఉంటాయి.
ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. జనవరి 8న తెప్పోత్సవం, 9న వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం నిర్వహించనున్నారు.

చిత్రం.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం