తెలంగాణ

11మృతదేహాల వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, డిసెంబర్ 10: జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నానక్‌రాంగూడలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం శిథిలాల తొలగింపుశనివారం ఉదయం వరకు కొనసాగింది. మృతదేహాల వెలికితీత ఉదయం 4 గంటకు పూర్తయింది. అప్పటి వరకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సంఘటనా ప్రదేశంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలు బయటకు తీసిన తరువాత మంత్రులు వెళ్లిపోగా, మిగిలిన కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేశారు. సంఘటనా ప్రదేశం నుంచి మృతదేహాలను సమీపంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో భద్రపరచారు. మృతదేహాలు అన్నీ బయటపడిన తరువాత అంబులెన్సులు ఏర్పాటు చేసి వారి బంధువులను బస్సులలో సొంతగ్రామాలకు తరలించారు.ప్రమాదం నుండి బయట పడిన రేఖ (25), ఆమె కుమారుడు దీపక్(4)కు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో రేఖ భర్త శివ(30) మృతి చెందాడు. శివ కుటుంబం కొంతకాలం క్రితం చత్తీస్‌గఢ్ నుండి ఉపాధికోసం నగరానికి వచ్చి నానక్‌రాంగూడలో నివాసముంటున్నారు. మిగిలిన కూలీలను విజయనగరం జిల్లాకు చెందిన పార్వతిపురానికి చెందిన వారిగా గుర్తించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు 30 గంటల పాటు శ్రమించి బయటకు తీసిన మృతదేహాలు పోలినాయుడు(32), వెంకటలక్ష్మి(28), సాంబయ్య (38), పైడమ్మ(35), గౌరి (14), శంకర్ (18), చిన్నపోలినాయుడు (30), నారాయణమ్మ (23), దుర్గారావు(22), మోహన్ (3)లుగా గుర్తించారు. ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. మృతదేహాలను బంధువులు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం వాహనాలను కూడా సమకూర్చింది. మృతులకు అందించాల్సిన పరిహారాన్ని కూడా అధికారులు చెక్కులు రూపంలో సభ్యులకు పంపించారు. ఉదయం 6గంటల వరకు రెవెన్యూ, జిహెచ్‌ఎంసి అధికారులు ఉండి సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు పనులు చేశారు. వివిధ శాఖల సహాయక చర్యలు, అమాత్యులు, పరిసర ప్రాంతాల సందర్శనలతో కిక్కిరిసిన నానక్‌రాంగూడ ఇపుడు నిర్మానుష్యంగా మారింది.