తెలంగాణ

టి- వాలెట్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10:నగదు రహిత కార్యకలాపాల్లో భాగంగా సకల హంగులతో తెలంగాణ ప్రభుత్వం టి- వాలెట్‌ను సిద్ధం చేసింది. నగదు రహిత కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో టి- వాలెట్ ముందడుగు అని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ రూపొందించడం దేశంలో ఇదే మొదటి సారి అని చెప్పారు. టి- వాలెట్ తయారీలో ప్రజలకు సౌకర్యం, సెక్యూరిటీ, ప్రయివసీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఐటి, ఇతర శాఖల అధికారులు, టి వాలెట్ సర్వీస్ ప్రోవైడర్లతో కెటిఆర్ శనివారం సమావేశం నిర్వహించారు. కంపెనీల ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వ విజన్‌ను వివరించారు. అత్యుత్తమ వాలెట్ తయారీతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వారంలో టి వాలెట్ లోగోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆవిష్కరిస్తారు. ప్రజలు ప్రభుత్వంతో చేసే ప్రతి నగదు చెల్లింపుల సర్వీసు ఉచితంగానే అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్స్ వంటి శాఖలతో టి- వాలెట్ సేవలు ఉంటాయని మంత్రి చెప్పారు. దశల వారిగా వీటిని విస్తరించుకుంటూ అన్ని రేషన్ షాపులు, స్కాలర్ షిప్‌లు, ఈ సేవల చెల్లింపులను సైతం టి వాలెట్ ద్వారా చెల్లించే విధంగా విస్తరిస్తామని తెలిపారు. ఈ టి వాలెట్ స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, కంప్యూటర్, కాల్ సెంటర్‌తో పాటు చివరకు ఫోన్ లేకపోయినా పని చేస్తుందని చెప్పారు. ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్ ఉంటే సరిపోతుందని అన్నారు. టి వాలెట్‌కు తెలుగు భాషను సైతం ఉపయోగిస్తామని దీని వల్ల గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. టి వాలెట్ కు ఇచ్చే సమాచారం, ఇతర వివరాలు అత్యుత్తమ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారం సురక్షితంగా ఉండేలా చూస్తామని చెప్పారు. ప్రయివసీకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. టి వాలెట్ ద్వారా తమ సేవలను ఉపయోగించుకునేందుకు వివిధ సంస్థలకు అవకాశం ఉంటుందని చెప్పారు.

చిత్రం... టి.వాలెట్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కెటిఆర్