తెలంగాణ

వెల్లువలా నల్ల ధనం... రూ.70లక్షల కొత్త కరెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: సీనియర్ పోస్టల్ అధికారి సుధీర్‌బాబు బంధువుల ఇళ్లల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నాలుగు ఇళ్ళలో సోదాలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలోని సుధీర్ బాబు బంధువు తులసీరాంనాయక్ ఇంట్లో జరిపిన సోదాలలో రూ. 70 లక్షల కొత్త రెండు వేల రూపాయల నోట్లను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు రూ. 3కోట్ల పాత నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న తులసీరాంనాయక్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం సీనియర్ పోస్టల్ అధికారి సుధీర్‌బాబును విచారణ నిమిత్తం సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు విచారణ జరిపిన ఐటి అధికారులు సుధీర్‌బాబును జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈనెల 23వరకు సుధీర్‌బాబు జుడీషియల్ రిమాండ్‌లోనే ఉంటారు. కాగా సుధీర్‌బాబు తాను పరిశ్రమల భవన్ పోస్ట్ఫాసులో నోట్ల మార్పిడి చేసినట్టు ఒప్పుకున్నారు. రూ. 80 లక్షల పెద్ద నోట్లను మార్చినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సుధీర్‌బాబుకు కమీషన్ల రూపంలో వచ్చిన రూ. 65 లక్షల 2వేల నోట్లు సిబిఐ స్వాధీనం చేసుకుంది. పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబుపై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదై ఉన్నట్టు సిబిఐ అధికారులు మీడియాకు తెలిపారు. రూ. 3.75 కోట్ల పాత నోట్లను మార్చినట్టుగా సిబిఐ గుర్తించింది. పూర్తి వివరాలను త్వరలో మీడియాకు వివరిస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. నోట్ల మార్పిడిలో సుధీర్‌బాబు ప్రధాన పాత్ర పోషించినట్టు తేలడంతో అన్ని కేసుల్లోనూ ఆయనను ఏ1 నిందితుడిగా చేర్చారు. హిమాయత్‌నగర్ పోస్ట్ఫాసులో సుధీర్‌బాబుతో పాటు రేవతి, రవితేజపై సిబిఐ కేసు నమోదు చేసింది. అదేవిధంగా జనార్ధన్‌రెడ్డి అనే మరో పోస్టుమాస్టర్‌పై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ రూ. 29లక్షలు స్వాధీనం
శనివారం హైదరాబాద్‌లో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 29.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 15 శాతం కమీషన్ తీసుకుని కొత్త కరెన్సీ ఇచ్చి పాత నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బింగి వాసుగౌడ్, బండారు వెంకటేశ్, మోదుగుల మోహన్ పట్టుబడిన వారిలో ఉన్నారు.