తెలంగాణ

పోలీసుల తనిఖీల్లో రూ.82 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, డిసెంబర్ 10: పోలీసుల తనిఖీల్లో 82.21 లక్షల కొత్త, పాత కరెన్సీ పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కొత్తూరు రూరల్ సిఐ మధుసూదన్ తెలిపారు. శనివారం ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కొత్తూరు బైపాస్ 44వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా 82 లక్షల 21 వేల రూపాయలు కొత్త, పాత కరెన్సీని తరలిస్తున్న ఒక కారు, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రెండు వేల రూపాయల నోట్లు 71 లక్షల 10 వేలు, 100, 50, 20, 10 రూపాయల పాత నోట్లు 11 లక్షల 11 వేల రూపాయలు పట్టుబడినట్లు వివరించారు. ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామానికి చెందిన ముట్పూర్ చంద్రారెడ్డి, పంది శివారెడ్డితోపాటు అన్నారం గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే ముగ్గురు వ్యక్తులు ఇండికా కారులో ఉన్నారని, ఇందులో శివారెడ్డి, చంద్రారెడ్డి అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో వ్యక్తి సత్యనారాయణగౌడ్ పరారయ్యడని సిఐ వివరించారు. ఈ సొమ్ముతో వారు హైదరాబాద్‌కు వెళ్తుండగా కొత్తూరు వద్ద తనిఖీ చేసి పట్టుకున్నామని ఆయన వివరించారు. రెండు నెలల క్రితం రైతుల వద్ద భూమి కొనుగోలు చేసి అదే సమయంలో 35 లక్షల రూపాయలు ఇచ్చారని, పెద్దనోట్ల రద్దు తరువాత పాత కరెన్సీని కొత్తనోట్లకు మార్చుకున్నట్లు వివరించారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కమీషన్లకు అలవాటు పడి కమీషన్ వస్తుందనే ఉద్దేశ్యంతో మార్పిడి చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్తుండగా కొత్తూరు బైపాస్ రహదారిపై పట్టుబడ్డార్నారు. నిందితులు చంద్రారెడ్డి, శివారెడ్డిని అరెస్టు చేసిన కోర్టుకు తరలించామని ఆయన తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో కొత్తూరు ఎస్సై శ్రీశైలం యాదవ్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.