తెలంగాణ

చిన్న సినిమాలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 11 : తెలంగాణ ఫిలిం చాంబర్స్‌కు కేంద్ర ప్రభుత్వం సినిమాలకు సెన్సార్, టైటిల్ రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని తెలంగాణ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్ స్థాపించిన రెండేళ్లలో మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్ పక్షాన అమ్మకు ప్రేమతో సినిమాకు సెన్సార్ చేసి క్లీన్ యూ సర్ట్ఫికేట్ అందచేశారన్నారు. దేశంలోని ఏ భాషలోని సినిమాకైనా తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన సెన్సార్ చేయవచ్చన్నారు. గతంలో ఎంతోమంది సెన్సార్ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడుల కృషితో సాధ్యమైందని, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన వారు ఏరంగానికి వెళ్లినా విజయం సాధిస్తారన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో వెయ్యి మంది నిర్మాతలున్నారన్నారు. 200 మంది ఆర్టిస్టులు, 150 డైరెక్టర్లు ఉన్నారన్నారు. 24 క్రాఫ్ట్‌లో 5వేలకు పైగా టెక్నీషియన్లు ఉన్నారన్నారు. సినీ ఆర్టిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇప్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. చిన్న సినిమాలకు ప్రభుత్వం గుర్తింపు కల్పిస్తుందని, చిన్న సినిమాలకు రూ.15 లక్షల వరకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందన్నారు. చిన్న సినిమాలకు ప్రభుత్వం వినోదం మినహాయింపు ఇచ్చిందన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు చిన్న సినిమాలను ప్రదర్శించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం మినీ థియేటర్లకు తగిన ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో 200 మినీ థియేటర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లా హుస్తాబాద్‌లో మినీ థియేటర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మినీథియేటర్ల నిర్మాణానికి సింగిల్ విండో ద్వారా అనుమతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్‌ను ప్రభుత్వ ప్రోత్సాహించటం వల్ల చిన్న సినిమాలు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ నిర్మాణానికి ప్రభుత్వం 9 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు. వీటిలో 50 శాతం తెలంగాణ ఫిలిం చాంబర్స్ కామర్స్‌కు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. చిత్రపురి కాలనీ నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్ పక్షాన తెలంగాణ ప్రాంతం నుంచి అధికంగా సినిమాలు, హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్స్‌కు ప్రోత్సాహాన్ని అందిస్తున్న సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈసమావేశంలో తెలంగాణ ఫిలిం చాంబర్స్ కామర్స్ డైరెక్టర్ వెన్నమనేని కిషన్‌రావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పయ్యావుల రాములు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణగౌడ్